Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు–వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది

 

22: 8

యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,

యోహాను మరలా ఒక దేవదూతను ఆరాధించడానికి సాగిలపడగా, మళ్ళీ దేవదూత అతనిని మందలించాడు (19:10).

22: 9

అతడు–వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

యోహాను తన పాఠాన్ని మొదటిసారి నేర్చుకున్నాడని మీరు అనుకుంటారు .

22:10

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది.

దేవదూత ” ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు” అని ఒక నిర్దిష్ట ఆజ్ఞను ఇస్తున్నాడు. దీని అర్థం మనం ప్రకటన గ్రంధమును అర్థం చేసుకోగలం . “యోహాను, నీవు ఈ పుస్తకం యొక్క ప్రవచనాలను బోధించేలా చూసుకో.” ప్రకటన పుస్తకం అందరికీ అర్థమయ్యేలా బహిరంగ పుస్తకంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రకటన అనేది ప్రజలు అర్థం చేసుకోగల సామర్థ్యానికి మించిన సంక్షిప్త, రహస్య పుస్తకం కాదు. దాని గురించి నిఘూడత ఏమీ లేదు. విశ్వాసులు యేసు రాక యొక్క వెలుగులో జీవించాలి. ప్రకటన వారికి గందరగోళంగా ఉంటే వారు అలా చేయలేరు.

నియమము:

ప్రకటన గ్రంధమును మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.

అన్వయము:

ప్రకటన గ్రంధము అర్ధముచేసుకోలేని కాదు. ఇది బహిరంగ పుస్తకం, దీని ద్వారా విశ్వాసులు చదివి భవిష్యత్తు కోసం నిరీక్షణను పొందవచ్చు.

Share