Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను2అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ అగాధములోనుండి లేచెను; అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. 3 పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలోఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను4మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను మొక్కలకైనను మరి వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. 5మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలన కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును6 దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును. 7 మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి, 8స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రు కలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. 9ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తు నట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. 10తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. 11పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.

12మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును

 

చివరి మూడు బూరలు, చివరి మూడు తీర్పుల యొక్క తీవ్రతపై దృష్టి నిలపడానికి మూడుసార్లు అయ్యో అని పిలుపునిస్తుంది (8:13). ఇంకా రాబోయే పాత్ర తీర్పులు తీవ్రతలో ఇంకా ఎక్కువ.  

9: 1

అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.

ఐదవ బూర మొదటి పదకొండు వచనాల వరకు విస్తరించియుంది. దేవుడు ఈ బూర వ్యాప్తిపై గుర్తించదగిన దృష్టిని సారించాడు కాబట్టి, ఈ బూర యొక్క సంఘటనలు దేవుని ఆర్థిక వ్యవస్థలో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని మనము ఊహించగలము.  

ఐదవ బూర యోహాను ఆకాశము నుండి పడిపోయిన నక్షత్రాన్ని చూడటానికి కారణమయ్యింది, ఈ “నక్షత్రం” సాతాను . ఈ నక్షత్రం పడిపోయిన స్థితిలో ఉందని గ్రీకు సూచిస్తుంది. దేవుడు అతన్ని పరలోకం నుండి తరిమివేసినందున సాతాను ఆకాశము నుండి పడిపోయాడు (యెష 14: 12; లూకా 10:18; ప్రక 12: 7-17).  

అగాథము లోని దెయ్యములు బయటకు వచ్చి భూమిని హింసించటానికి దేవుడు సాతానుకు “తాళము” ఇచ్చాడు. “అడుగులేని గొయ్యి” దెయ్యముల నివాసం ( ప్రక 9:11; 11: 7; 17: 8; 20: 1, 3). పడిపోయిన దూతలకు ఇది నిర్బంధ ప్రదేశం.   

9: 2

అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ అగాధములోనుండి లేచెను; అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.

ఈ వచనంలోని “అతడు” ఒక వ్యక్తి – సాతాను. మహాశ్రమల ప్రారంభంలో దేవుడు అతన్ని అకాశం నుండి పడద్రోసాడు ( ప్రక 12: 9, గొప్ప మహాశ్రమ శ్రమల సగ భాగములో ప్రారంభమవుతుంది ) . సాతానైన లూసిఫెర్ దయ్యముగా మారిపోయాడు.  

9: 3

పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలోఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.

లేఖనం మిడుతలను తీర్పుతో అనుబంధిస్తుంది (నిర్గ. 10: 12-17). మిడుతలు వాటి మార్గంలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేసే విధంగా  గొప్ప సమూహాలలో వస్తాయి.  

ఈ భాగములో ఈ రాక్షసులు తేళ్లు అని చెప్పలేదు కాని వాటికి తేలు యొక్క శక్తి ఉందని చెబుతుంది . 

9: 4

మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను మొక్కలకైనను మరి వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.

ఈ రాక్షసులు వృక్షసంపదను లేదా పర్యావరణ వ్యవస్థను బాధించవు; అవి ప్రజలను బాధపెడతాయి . ఈ రాక్షసులు 144,000 మందిని మినహా అందరినీ బాధపెడతారు ఎందుకంటే దేవుడు తన ముద్రతో వారిని రక్షిస్తాడు. దేవుడు ఈ నాయకులను దెయ్యాల స్వాధీనం నుండి కాపాడుతాడు.  

దేవుడు తన క్రమశిక్షణతో భూమిని బాధపెట్టడానికి ఈ రాక్షసులను పంపుతాడు. ఈ ఆక్రమణదారులపై దేవుడు కొన్ని ఆంక్షలు విధించాడు. దేవుడు ఎవరిని బాధపెట్టడానికి వాటిని అనుమతించాడో వారిని మాత్రమే బాధిస్తాయి మరియు పరిమిత కాలానికి మాత్రమే. దేవుడు సార్వభౌమత్వంతో దెయ్యాల ప్రపంచాన్ని నియంత్రిస్తాడు.    

9: 5

మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలన కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.

దేవుని వాటికి ఇలా చేయడానికి “అధికారం” ఇచ్చాడు, కాబట్టి వారు నాశనం చేయడానికి స్వయంప్రతిపత్తి గలవారు కాదు. దేవుడు వాటి హింసను ఐదు నెలలకు పరిమితం చేస్తాడు.  

9: 6

దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.

మనుష్యులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారు కాని అది వారి వలన కాదు. వారి అనుభవించే హింస ప్రాణాంతకం కాదు. ఐదు నెలలు అంత్యక్రియల చేసేవారికి పని ఉండదు.  

9: 7

మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి.

ఈ రాక్షసుల యొక్క ఎనిమిది లక్షణాలను యోహాను వివరించాడు . మొదట, వాటి ఆకారం యుద్ధానికి సిద్ధమైన గుర్రాలలా ఉంది. ఈ జీవులకు చైతన్యం ఉంది. ఇవి ఆక్రమించే జీవులు. అవి అశ్వికదళంలా వచ్చాయి. రెండవది, అవి బంగారం వంటి కిరీటాలను కలిగి ఉన్నాయి, ఇది ఒక విజేత యొక్క విలక్షణత. ఇది సాంస్కృతిక ఆలోచనతో రాక్షసుల ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మూడవదిగా, వాటి ముఖాలు మనుష్యుల ముఖాలలా ఉన్నాయి. ఇది తెలివితేటలను సూచిస్తుంది.         

 బైబిల్ దినములో మిడుతలు శత్రువులు . మిడుతలు గుంపులు ఒక రోజులో పంటను తుడిచిపెట్టగలవు. 

9: 8

స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రు కలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను .

ఈ రాక్షసుల యొక్క నాల్గవ లక్షణం ఏమిటంటే వాటికి స్త్రీల వెంట్రుకలు ఉంటాయి. ఇది పొడవైన, వదులుగా ఉండే జుట్టును కలిగిన, భయంకరమైన జీవులనే చిత్రాన్ని ఇస్తుంది. మరొక వ్యాఖ్యానం కూడా నిజం కావచ్చు, అవి చాలా అద్భుతమైన అందం మరియు తేజస్సు కలిగివుంటాయి , బహు కొద్దిమంది మాత్రమే వారి తప్పుడు బోధను తిరస్కరించగలరు. ఈ తప్పుడు బోధకుల అధికారం మరియు శక్తి కారణంగా చాలామంది తమ ప్రచారంలోకి వస్తారు.    

వారి పండ్లు సింహం కోరలులా ఉంటాయి. ఇది భయపెట్టే చిహ్నం . తప్పుడు బోధనకు లొంగిపోయిన వారికి అవి నీచంగా మరియు వారి నమ్మకానికి హాని కలిగించేవిగా మారుతాయి. తప్పుడు బోధకులు తమ అనుచరులపై దయ చూపరు.    

9: 9

ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తు నట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.

ఐదవది, వాటికి ఇనుము వంటి మైమరువులు ఉన్నాయి. ఇది ఇనుపరథం అయి ఉండవచ్చు. ఈ రాక్షసులు దాడికి గురయ్యేవి కాదు .   

ఆరవది, వాటి రెక్కల శబ్దం యుద్ధానికి వెళ్ళే రథాల శబ్దం లాంటిది. తప్పుడు బోధన యొక్క శబ్దం భయపెట్టవచ్చు .  

9:10

తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.

ఈ మిడుతలు పంటలపై దాడి చేయలేదు, కాని ప్రజలపై చేసాయి. ఐదు నెలలు మాత్రమే తీర్పు అమలు చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు.  

9:11

పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.

ఈ రాక్షసులకు రాజు ఉన్నాడు; అతడు సాతాను 

“అబద్దోను” అంటే విధ్వంసం .

నియమము:

ఏ దయ్యము క్రైస్తవుడిని పీడించలేదు.

అన్వయము:

దేవుని తీర్పు నిజమైనది. ఈ లేఖనభాగం వినోదం కోసం కాదు. తప్పుడు బోధన వేళాకోళం కాదు. ప్రజలు తప్పుడు బోధనను అనుసరించినప్పుడు ఇది ఎల్లప్పుడూ నిరాశకు దారితీస్తుంది. మహాశ్రమలో ఇది తీవ్రంగా పెరుగుతుంది. నేడు, ప్రజలు “బలమైన మాయ” లోకి పడిపోతున్నారు. సాతాను శక్తి ప్రజలను అబద్ధం నుండి అబద్ధానికి నడిపిస్తుంది. వారు నిజాన్ని తప్ప మరేదైనా నమ్మాలని కోరుకుంటారు.        

దేవుని ముద్ర ఉన్నవారిని ఏ దయ్యము తాకలేదు. ఏ దయ్యము క్రైస్తవుడిని పీడించలేదు. క్రైస్తవుడు “క్రీస్తులో” ఉన్నాడు. యేసు దేవుని ముందు కలిగి ఉన్న అదే స్థితిని అతనూ శాశ్వతంగా కలిగి ఉన్నాడు.   

Share