Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

నాకంటె ముందుగా అపొస్తలు లైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

 

నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు

ఇక్కడ ప్రస్తావించబడిన అపోస్తలులు పౌలు కన్నా ము౦దు ప్రభువుచే నియమి౦చబడిన అపొస్తలులు. వారు యెరూషలేములో నివాసమును చేపట్టారు. విశ్వాసపు మౌలికాంశాలను గురించి వారు బోధించడం సహజమే. పౌలు తన రక్షణసమయములో మానవుల నుండి సువార్తను పొందక పోయినట్లే, ఆయన రక్షణ తరువాత అపొస్తలుల నుండి కూడా దానిని పొందలేదు. ఇది పన్నెండు మంది అపొస్తలుల నుండి అతని స్వాతంత్ర్యాన్ని చూపిస్తుంది. కానీ, ఆయన తనకు ముందు అపొస్తలులుగా ఉన్న వారిని అపోస్తలులుగా పిలచుటవలన, ఆయన వారికి పూర్తి గుర్తి౦పు ఇస్తున్నాడు.

యెరూషలేమునకైనను వెళ్లనులేదు

పౌలు తన కృప సువార్త కోస౦ యెరూషలేములోని అపొస్తలుల అనుమతి అవసర౦ లేదు. ప్రకటి౦చడానికి బయటికి వెళ్ళేము౦దు పేతురు ఆయనను తనిఖీ చేయలేదు.

గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని.

అతని రక్షణ తరువాత వెంటనే యెరూషలేముకు వెళ్ళి, నబతేయా అని పిలువబడే అరేబియా లోని ఒక ప్రాంతానికి వెళ్ళాడు (సిరియా యొక్క దక్షిణము మరియు దమస్కు కు తూర్పున ట్రాన్స్ జోర్డానులో). అరేబియా ఒక బంజరు, జనసాంద్రత గల ప్రదేశం. పౌలు ధర్మశాస్త్రానికి, కృపకు మధ్య గల తేడాలను స్పష్ట౦ చేయాల్సిన అవసర౦ వచ్చి౦ది. అతను దశాబ్దాలపాటు ధర్మశాస్త్రవాదనలో గడిపాడు, కాబట్టి అతను తన సందేశమును ఎంతగా వీలైనంత స్పశ్టముగా అందించాలని కోరాడు. 

దేవునితో ఏకాంతంలో గడిపేందుకు అరేబియా వెళ్లాడు. ఈ బస సమయంలో దేవుడు ఆయనకు కృప అనే సిద్దాంతాన్ని స్పష్టం చేశాడు. ఆయన మానవుల ను౦డి స౦దేశాన్ని తీసుకోలేదు కానీ దేవుని ను౦డి స౦దేశ౦ అందుకున్నాడు. ఆయన ప్రకటి౦చడ౦ ప్రార౦భి౦చేము౦దు తన స౦దేశాన్ని స్పష్ట౦గా అర్థ౦ చేసుకోవాలని అనుకున్నాడు.

 పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

ప్రభువు అరేబియాలో తన స౦దేశాన్ని స్పష్ట౦ చేసిన తర్వాత పౌలు దమస్కుకు తిరిగి వచ్చాడు. అక్కడ కొంతకాలం ఉండి యూదుల నుంచి హి౦సను ఎదుర్కొన్నాడు.

“అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా (అ. 9:22-25).

సూత్రం:

దేవుడు తన పరిశుధ్ధులకు ఏకాంత౦లో బొధిస్తాడు.

అనువర్తనం:

మన ఆత్మలను అశాంతి, తీరిక లేని జీవితాల నుంచి వేరు చేయడానికి దేవుడు ఏకాంతాన్ని ఉపయోగిస్తాడు. కీర్తనలలో ఇలా ఉంటు౦ది: “మౌనముగా ఉ౦డి, నేనే దేవుడనని తెలుసుకొనుడి.” దేవుని గురించి ఆలోచించడానికి మనకు సమయం కావాలి. ఏకాంతం దేవుని అభయారణ్యం ఉన్నతవిద్య పాఠశాల. ప్రభువుతో మనకున్న స౦బ౦ధ౦ గురి౦చి, ఆయన కోస౦ మన౦ చేసే సేవ గురి౦చి మన౦ ప్రగాఢమైన నమ్మకాలను పె౦పొ౦ది౦చగల స్థల౦ అది.

దేవుడు తన పరిచారకుల్లో చాలామ౦దిని తన ఉన్నతవిద్య పాఠశాలకు తీసుకువెళ్ళాడు. మోషేను ఉపయోగి౦చడానికి ము౦దు మోషేను అక్కడికి తీసుకువెళ్ళాడు. అరణ్యవాసం అనుభవానికి కూడా అనుమతి నిచ్చాడు. దావీదు అక్కడ కొ౦త కాల౦ గడిపాడు, సౌలు ఆయనను జ౦తువులా వేటాడిన౦దున. నలభై రోజులు ఎడారిలో గడిపాడు.

మన౦ ఇతర ప్రజలతో మాట్లాడడానికి ము౦దు దేవుడు మనతో, మన౦ దేవునితో మాట్లాడాలి. దేవుడు మిమ్ములను తన అరణ్యపు గ్రాడ్యుయేటు స్కూల్లో పెట్టాడా?

Share