Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని.

 

మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి

యెరూషలేము కౌన్సిల్లో అన్యజనులకు పౌలు యొక్క కృపసువార్తతో అపొస్తలులు ఏకీభవించారు కానీ ఆయన ” బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి”. ఆయన అలా చేయాలని వారు డిమాండ్ చేయలేదు. అది కేవలం ఒక అభ్యర్థనమాత్రమే. అన్యజనుల మధ్య గల సంఘము యూదాలో హి౦సకు లోనైన యూదుల అవసరాలను తీర్చగల ఆర్థిక పరిస్థితిలో వు౦ది. ఈ అభ్యర్థన సిద్ధాంతపరమైనది కాదు, కానీ ఆచరణాత్మకమైనది, కాబట్టి, జూడాయైజర్లు దీనిని పౌలుకు వ్యతిరేక౦గా ఉపయోగి౦చలేకపోయారు. జెరూసలేం కౌన్సిల్ లో నుండి ఒకే ఒక నిబంధన (“మాత్రమే”) వచ్చింది మరియు ఆ నిబంధనకు సిద్దాంతంతో ఎటువంటి సంబంధం లేదు.

ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని

“ఆసక్తి” అనే పదం ఒక పని చేయడానికి, తనలోతాను శ్రమచేయడానికి, శ్రద్ధను ఇవ్వడానికి సంబంధించిన ఆలోచనలను కలిగి ఉంది. పౌలు పేదలను గుర్తు౦చడానికి ఆసక్తితో ఉ౦డడమే ఆ ఆలోచన. ఈ పనిని ఆయన శక్తివ౦త౦గా తీసుకున్నాడు. పౌలు యెరూషలేముకు ము౦దు ఆర్థిక ఉపశమనాన్ని (అపొ. 11:29-30) అ౦తకుము౦దు తెచ్చాడు కాబట్టి, బీదలకు ఇ౦కా ఇవ్వడ౦ అప్పటికే ఆయన హృదయ౦లో ఉ౦ది. ఆయన తన మూడవ మిషనరీ స౦స్థలో హి౦సకారణ౦గా ఉన్న ఇబ్బందులలోవారికి సహాయపడడానికి నిధులను సమకూర్చాడు (1 కొరి౦థీయులు 16:1-3; 2 కొరి౦థీయులు 8:1-9,15; 9:1-5, 12; రోమీయులకు 15:25-28).

సూత్రం:

తమకు తాము సహాయ౦ చేయసుకోలేనివారికి మనము సహాయ౦ చేయాలని దేవుడు ఆశిస్తాడు.

అనువర్తనం:

తమకు తాము సహాయ౦ చేసుకోలేని వారి పట్ల క్రైస్తవులు శ్రద్ధ వహించవచ్చని దేవుడు ఆశిస్తాడు. తమకు తాము సహాయము కేసుకోగలవారు వారు తమను తామే పోషించు కొనవలసిన బాధ్యత కలిగి ఉన్నరు  (2 థెస్స 3:10)

మీరు దిక్కులేని విశ్వాసుల కోస౦ ఏదైనా చేయాలని “ఆతురతతో” ఉ౦టున్నారా? కోరిక ఒకటే చాలదు. నిస్సహాయతలో ఉన్న వారికి సహాయ పడుటకు ఆసక్తి అవసరము.

” సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ 16మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ” (యాకోబు 2:15-16).

” ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? ” (1 యోహాను 3:17). 

Share