Select Page

 

తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబా కూడ వారి వేషధారణముచేత మోస పోయెను.

 

గనుక బర్నబా కూడ వారి వేషధారణముచేత మోస పోయెను.

పేతురు, ఆయన స్నేహితుల వేషధారణ బర్నబాను సత్యానికి దూర౦గా నడిపిస్తు౦ది. “వేషధారణ” అనునది ముసుగు వెనుక చర్య. ఒక రంగస్థల కళాకారుడు తాను కాని వ్యక్తిగా నటిస్తారు. వేషధారణ అనునది ఏదో ఒక విషయాన్ని బాహ్యంగా చూపించడం అనేది అంతర్గతంగా సత్యం కాదు. ఇది ద్విముఖ తరహా.

ప్రాచీన గ్రీకు నాటకంలో, నాటకములోని నటుడు వారి మొత్తం తలని కప్పిన ఒక వ్యాక్స్ ముసుగును ధరిస్తాడు. వారు ఒక విషాదపాత్ర పోషించినప్పుడు విధాద ముసుకు, ఒక సంతోషకరమైన భాగం కోసం చిరునవ్వు ముసుగు ధరిస్తారు. వారు చర్య చేసినప్పుడు, వారు ముసుగు వెనుక నుండి తీర్పుచేస్తారు. రెండు సందర్భాల్లోనూ అది అసలు వ్యక్తి కాదు. పీటర్, బర్నబా, ఇతరులు ధర్మశాస్త్రవాదము అను ముసుగులో ఉన్నారు.

వారి వేషధారణ వల్ల ఇతరులు కృపనుండి దూరము చేయబడ్దరు. తమ నాయకుల ప్రవర్తనతో ప్రజలు కృప యొక్క సత్యాన్ని విసర్జించారు. నాయకుల నుంచి తమ జాడతీసుకున్నారు. ఏ క్రైస్తవుడు కూడా పడిపోవు నాయకులమీద భ్రమపడనివ్వకూడదు. అది ఆ పాపపు సామర్ధ్యమును అర్థం చేసుకోగల ఏ క్రైస్తవుని అయినా  ఆశ్చర్యం కలిగించదు. మన పాపపు సామర్ధ్యము పెరుగదు తక్కువకాదు.

బర్నబా పౌలుకు పరిచర్యలో సహోద్యోగి, సన్నిహితస్నేహితుడు. పౌలను కొందరు నమ్మకమైనవానిగా ఎంచినప్పుడు బర్నబా అక్కడ ఉన్నాడు (అపొస్తలుల కార్యములు 9:27). పౌలు హ౦తకునిగా విడిచిపెట్టబడి, మిషనరీగా తిరిగి వచ్చాడు. ఎవరు నమ్ముతారు? బర్నబా పౌలును నమ్మాడు, కానీ చుట్టూ ఉన్న వాళ్ల౦దరూ ఆయనను నమ్మలేదు. అందరూ అనుమానాస్పదముగా ఉన్నారు కానీ బర్నబా అతనిని లోనికి తీసుకువెళ్ళాడు (అ.కా.11:19f). బర్నబా మంచివాడు, విశ్వాసముగలవాడు (అ.కా. 15:25). అ౦తియోకులో వాక్యాన్ని బోధి౦చే పరిచర్యలో పౌలును ప్రవేశపెట్టాడు.

పౌలు, బర్నబాలు ఇద్దరూ కలిసి కృప సువార్తను ప్రకటి౦చడ౦లో ప౦పి౦చబడ్డారు. ఇప్పుడు బర్నబా తన కృపపై తన నిజమైన నమ్మకాన్ని చూపని ముసుగును ధరించాడు. అందరిలో బర్నబా వేషధారణలో పడిపోవుట అసాధ్యము. ఇది పౌలుకు క్రూరమైన దెబ్బ. ఇది నిజంగా షాక్. సీనియర్, అనుభవజ్ఞుడైన మిషనరీ కూడా చెడుగా వెళ్లవచ్చు. బర్నబా పేతురుమీద చాలా నమ్మకాన్ని ఉంచాడు. అయితే, అతను ఒక మనిషి మరియు ఒక మనిషి గా, అతను ఒక అపజయాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే అతను పాపపు సామర్ధ్యముకలిగి ఉన్నాడు.

సూత్రం:

ఉపయుక్తత మోసమును ఎన్నటికీ సమర్థి౦చదు.

అనువర్తనం:

నిజ క్రైస్తవ్యము సత్యం మీద పని చేయాలి తప్ప వంచనకు మీద కాదు. ఐక్యత కన్నా సత్యం ముఖ్యం. క్రైస్తవులు లేని ఒక విషయాన్ని చెప్పినప్పుడు, ఆ స౦బ౦ధ౦లో యథార్థత ఉ౦డదు.

మోసాన్ని సమర్థి౦చడ౦ ఎన్నటికీ అంగీకారయోగ్యము కాదు. నేడు చాలామ౦ది నాయకులు, ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారనే విషయ౦లో శ్రద్ధ వ౦టి వాటి వలలో పడతున్నారు. నాయకులు సత్యానికి సంబంధించి ప్రజాభిప్రాయానికి లొంగకూడదు. అల్లరిమూకల ఒత్తిడి మనవద్దకు రావడానికి మనం అనుమతించకూడదు.

Share