అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు
పేతురు, పౌలు ఇద్దరి పరిచర్యలలో దేవుడు ఎలా పనిచేశాడనే విషయాన్ని ఈ వచనము వివరిస్తుంది.
అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే
” సామర్థ్యము కలుగజేసినవాడే ” అనే పదాలు గ్రీకుభాషలో మానవాతీత ఫలితాలను ఉత్పత్తి చేసే భావాన్ని కలిగివు౦టాయి. కొత్త నిబంధన ఎప్పుడూ ఈ అతీంద్రియ పని అనే పదాన్ని ఉపయోగిస్తుంది. దేవుడు పని చేస్తాడు. ఆయన పని చేయడమే కాదు, ఆయన ప్రజల”లో” పని చేస్తాడు. ప్రజలను ఎనర్జరైజ్ చేస్తాడు. పేతురు పరిచర్యలో దేవుని మానవాతీత మైన పనిని పౌలు ధృవీకరి౦చాడు.
” గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్ ” (హెబ్రములు 13:20-21).
అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు
పౌలు పేతురుపై దాడి చేయుటలేదు కానీ పేతురు పరిచర్యలో పనిచేసిన అదే పరిశుద్ధాత్మ తన పరిచర్యలో “కూడ” పనిచేశాడని చెప్పాడు. దేవుడు ప్రతి సమూహానికి సువార్తను ఎలా చేర్చుబడాలో అనే విధానాన్ని తానే రూపొందింస్తాడు. అది పేతురు పరిచర్య అయినా, పౌలు పరిచర్య అయినా, ఆ పని చేసేదే దేవుడు.
“… ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ” (ఫిలిప్పీయులకు 2:13).
సూత్రం:
దేవుడు మనకు పరిచర్య అప్పగిస్తే, ఆయన మనకు అవసరమైన శక్తిని కూడా ఇస్తాడు.
అనువర్తనం:
పరిచర్యలో మన అనుభవ౦ మన పిలుపును ధ్రువీకరిస్తుంది. దేవుడు మనకు పరిచర్య అప్పగిస్తె, ఆయన దానికి కావలసినది సమకూరుస్తాడు.
ఇతర సంఘములతో, పరిచర్యలతో పోటీపడే బదులు పేతురు పరిచర్యను ధృవీకరి౦చిన పౌలు మాదిరిని మన౦ అనుసరి౦చాలి. మీరు ఇటీవల మీ ఇంటి సమీప సంఘమును ధృవీకరించారా? క్రీస్తు పరిచర్య లో వాక్య౦ నిజ౦గా ప్రకటి౦చబడితే ఎ౦దుకు దాడి చేయాలి?