Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు.

 

 కాబట్టి

పౌలు క్రీస్తుపై తమ విశ్వాసాన్ని ఉ౦చేవారు అబ్రాహాము వలెనే నీతిమంతులుగా తీర్చబడుదురని అ౦తకు ము౦దు చేసిన వాదనను౦డి సంగ్రహి౦చాడు.

విశ్వాససంబంధులే

ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా రక్షణ పొందాలి. ధర్మశాస్త్రవాదులు ధర్మశాస్త్రముచే నీతిమంతులుగా తీర్చబడుటకు ప్రయత్నించే వారికి భిన్నంగా ఈ వచనము విశ్వసము గురించి చెబుతుంది. “విశ్వాస౦” అనే పదబ౦ధ౦, విశ్వాసమే దేవునితో తమ స౦బ౦ధానికి మూల౦ అని తెలుపుతుంది.

విశ్వాసముగల అబ్రాహాముతోకూడ

తన వాగ్దానాలను నమ్మేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కృపకు ప్రతిస్పందించే వారిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.

గ్రీకుభాషలో “అబ్రాహాముతో” కు ము౦దు ఒక నిర్దిష్టమైన పదము ఉ౦ది. “అబ్రాహాముతో” అనే పదబ౦ధాన్ని మన౦ “విశ్వాసి” అని అనువది౦చవచ్చు. అబ్రాహాముకు ఆవశ్యకమైన పాత్ర విశ్వాసము. దేవుని ఆశీర్వాదాన్ని పొ౦దడానికి అబ్రాహాము తన విధాన౦గా కర్మలకు బదులు విశ్వాసాన్ని ఎ౦పిక చేసుకున్నాడు.

సూత్రం:

దేవుడు ఎల్లప్పుడూ కృపను మన ఆశీర్వాదానికి మూలముగా చేస్తాడు.

అనువర్తనం:

దేవుడు ఎల్లప్పుడూ మనల్ని, మరియు అన్ని కాలాల్లోని వారిని విశ్వాసంద్వారా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ కృపను మన ఆశీర్వాదానికి మూలముగా చేస్తాడు. దేవునికి ఆమోదయోగ్యమైనదిగా కొలవవలసిన అవసరం లేదని తెలుసుకోవటం చాలా ఆనందము. యేసు అవసరమైన ప్రమాణలన్ని నెరవేర్చడు. విశ్వాస౦తో పనిచేసేవారిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.

Share