Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్ని టికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు

 

4:17లో, పౌలు ధర్మశాస్త్రంక్రింద జీవించువారికంటే క్రీస్తులో తన హోదానుబట్టి విశ్వాసికిగల ఆధిక్యతలనుగూర్చి సోదాహరణంగా చెప్పాడు. ఈ విభాగం 3:23-26 లోనివిషయాలను మరింత వివరిస్తుంది. 

మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు

పౌలు ఒక దాసుడైన సంరక్షకుడికింద నివసిస్తున్న గొప్ప ఆస్తికి వారసుడైనవానియొక్క ఉదాహరణను ఇస్తున్నాడు.

బాలుడైయున్నంతకాలము

బాలుడు అనగా చిన్నపిల్లవాడు అని అర్థం. ఈ వ్యక్తి యుక్తవయస్సులోని బాధ్యతలు తీసుకోవడానికి చాలా చిన్నవాడు. ఒక దాసుడు /సంరక్షకుడు ఈ పిల్లవాడిని ఎప్పుడు లేవాలో, ఎప్పుడు స్కూలుకు వెళ్లాలోచెప్తూ క్రమశిక్షణలో ఉంచేవాడు.

ఒక వ్యక్తియుక్తవయస్సుకు ప్రవేశించేవయస్సును రోమన్ సంప్రదాయంలో పేర్కొనలేదు. వారసుడు సిద్ధ౦గా ఉన్నట్లు త౦డ్రి భావించినప్పుడు, అతను ఈ సందర్భమును లిబరల్లియా అనే ఉత్సవ౦గా మార్చి 17న జరుపుకు౦టాడు. ఈసమయంలో, వారసుడు తనటోగావిరిలీస్ (యుక్తవయస్కుడు యొక్క కోటు) అందుకు౦టాడు. ఈ ఉత్సవంలో ఆ బాలుడు తన చిన్ననాటి బొమ్మల్ని కాల్చివేస్తాడు. ఈ వ్యక్తికి ఇప్పుడు చిన్నపిల్లవాడిగా తనను పరిపాలించిన బానిసపై అధికారం ఉంది.

అన్నిటికినికర్తయైయున్నను . . . . అతనికినిదాసునికిని భేదమునులేదు

ధర్మశాస్త్రం క్రింద పనిచేసే వ్యక్తికీ, ఆస్తిఅంతటికీ వారసుడుగా ఉంటూ సంరక్షకుని క్రింద ఉంచబడిన పిల్లవానికి వ్యత్యాసము లేదు. అతను ఒక చట్టబద్ధమైన వారసుడు కానీ తన ఆస్తిపై తన చట్టపరమైన హక్కులను ఉపయోగించుకోవడానికి అతనికి హక్కు లేదు. ధర్మశాస్త్రము పాతనిబంధనయందు విశ్వాసులమీద కావలిగాఉన్న సంరక్షకుడు (3:24-26). ధర్మశాస్త్రమునకు తిరిగివెళ్ళు క్రైస్తవుడు తననుతాను బానిసత్వం క్రిందకు అప్పగించుకుంటున్నాడు.

నియమము :

కృప క్రింద ఉన్న విశ్వాసులు దేవునితో కొన్ని హక్కులు ఉన్నారు.

అన్వయము :

ధర్మశాస్త్రం క్రింద పని చేసినంత కాలం మనం దాసులముగా జీవిస్తాం. మనం హక్కుల్ని స్వతంత్రించుకునే వరకు వరకు దేవుడు మన హక్కులను భద్రపరుస్తాడు. ద్రవ ఆస్తుల్లో కోట్ల రూపాయల మేర ఉండి, ఆ ఆస్తులను ఎన్నడూ ఉపయోగించకుండా ఉండే అవకాశం ఉంది.

ఒక పిల్లవాడు సంపద విలువను అర్థం చేసుకోలేని కారణంగా కోట్ల రూపాయల ప్రామిసరీ నోటుతో పొలిస్తే ఒక రూపాయి నాణెంతో ఎక్కువ సంతోషపడుతాడు. క్రైస్తవులకు గొప్ప సంపదలు ఉన్నాయి కానీ క్రీస్తులో తమ ఆధిక్యతలను గుర్తించని కారణంగా వాటిని ఉపయోగించరు. వారు ఇప్పుడు క్రీస్తునందు వయోజనులైన కుమారులు కనుక వారు తమ ఆస్తులను ఉపయోగించుకోగలరనే విషయం వారు గ్రహించరు. వారు తమ క్రియల ద్వారా దేవుని యొక్క ఆమోదమును పొందడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు మరణ౦ కారణ౦గా తమకు దేవుని అనుగ్రహ౦ ఉ౦దని వారు గ్రహి౦చరు.

తన సొత్తును ఒక యజమాని స్వాధీనపరచుకొన్నట్లు క్రైస్తవులు క్రీస్తులో తమ ఆధిక్యతలను స్వాధీనపరచుకోవాలి. ఆ విమోచన దినం ఎంత అద్భుతమైనది! 18 యేళ్ళ వ్యక్తి తన కోట్లరూపాయల సొత్తును స్వాధీనపరచుకొన్నట్లు మనము కూడ కృప ద్వార క్రీస్తులో మన ఆధిక్యతలను స్వతంత్రించుకోవచ్చు.

మనం చేసే క్రియలను బట్టి ధర్మశాస్త్ర శిక్ష నుండి మనలో ఎవరూ తప్పించుకోలేరు. మన౦ చేసిన పాపములను చూపి౦చడమే ధర్మశాస్త్ర౦ ఉద్దేశ౦, మనలను రక్షించుట కాదు. అ౦దుకే దేవుణ్ణి స౦తోష౦గా ఉ౦చే ప్రయత్న౦లో మన౦ స్వయంకృషిని విడిచిపెట్టుకు౦టు౦ది. దేవుని పుర్తిగా సంతృప్తిపరచే క్రీస్తు సంపూర్తి చేసిన కార్యముపై మనము పూర్తిగా ఆధారపడుతున్నాము. దేవునితో మన ఆధిక్యతలు ఆయన నుండే వస్తాయి.

Share