“సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు.”
పౌలు ఇప్పుడు చారిత్రక, సిద్ధా౦త౦లో వ్యవహరి౦చడ౦ ను౦డి, కృప సూత్రాన్ని వారు ప్రారంభములో స్వీకరించిన విషయములను జ్ఞప్తికితెచ్చుకొని గలతీయులతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడు (గలతీయులు 4:12-20). వారు మార్పుచెందిన సమయంలో పరస్పర ప్రత్యేకమైన కృప సూత్రాన్ని అంగీకరించారు.
సహోదరులారా
పౌలు క్రీస్తులో వారి స౦బ౦ధాన్ని ఆధార౦ చేసుకొని గలతీయులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. నిజం చెప్పినందుకు వారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలి?
మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను
పౌలు కృప సువార్తకు నమ్మక౦గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన గలతీయులు కూడా సువార్తపట్ల నమ్మక౦గా ఉ౦డాలని వేడుకుంటున్నాడు. ఒక పరిసయ్యుడిగా పౌలు తన స్వనీతిని చూసి గర్వపడేవాడు కానీ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, క్రీస్తు నీతి కొరకు స్వనీతిని విడిచిపెట్టాడు (ఫిలిప్పీయులకు 3:4-9). ఆయన పూర్తిగా దేవుని కృపపై మీద ఆధారపడ్డాడు. గలతీయులు కూడా అదే స్థితికి రావాలని పౌలు విజ్ఞప్తి.
నేను మీవంటివాడనైతిని గనుక
పౌలు ఒకప్పుడు ఉన్న చోట, గలతీయులు ఇప్పుడు ఉన్నారు – ధర్మశాస్త్రవాదములో. పౌలు అన్యజనుల లో తన స్థానం కలిగియుండడానికి ధర్మశాస్త్రవాదమును పక్కన పెట్టాడు. ఆయన ధర్మశాస్త్రవాదమును, దాని సంఘాలను వదులుకున్నాడు. తాను వారికోసం విడచిపెట్టిన రీతిగానే గలతీయులు కూడా దేవుని అనుగ్రహమును పొందుటకు సహకరించు వ్యవస్థగా వారు పరిగణిస్తున్న ధర్మశాస్త్రమును విడచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
పౌలు కూడా క్రీస్తును స్వీకరించినప్పుడు గలతీయుల లాగే ఉన్నాడు. వారు మతాన్ని మోక్షమార్గంగా త్రోసిపుచ్చి, క్రీస్తును తమ ఏకైక నిరీక్షణగా నమ్మారు. పౌలు కృపను పొందినవాడు, ఎందుకంటే ధర్మశాస్త్రవాదం రక్షణకు మార్గమనే విషయమును త్రోసిపుచ్చాడు. ధర్మశాస్త్రవాదం ప్రజలమీద తెచ్చే ఒత్తిడి ఆయన అర్థం చేసుకున్నాడు.
మీరు నాకు అన్యాయము చేయలేదు.
ధర్మశాస్త్రవాదములోనికి వెళ్లుటద్వారా గలతీయులు పౌలుకు అన్యాయం చేయలేదు. ఇది పౌలుకు వ్యక్తిగత సమస్య కాదు. వారితో తనకు వ్యక్తిగత వైరం లేదు.
నియమము :
సైద్ధాంతిక పోరాటాలను వ్యక్తిగత సమస్యగా మనం మార్చకూడదు.
అన్వయము :
ఎవరైనా తప్పుడు సిద్దాంతంలో పడినప్పుడు అది కేవలం సిద్ధాంతసమస్య మాత్రమే కాకుండా ప్రజల సమస్య అవుతుంది. సత్యాన్ని విభేదించేవారితో సమ్మతించకపోవడానికి అసత్య సిద్ధాంతం ఒక ప్రామాణికమైన ప్రాంతం. ఏదేమైనప్పటికీ, పరిణతి చె౦దిన క్రైస్తవులు వ్యక్తిగత భావాలను సూత్రబద్ధతకు లేదా ఆవశ్యక సత్యానికి అడ్డుపడనివ్వరు. మన భావాలను సత్యానికి ఆటంకంగా అనుమతిస్తే, సత్యాన్ని అణచివేస్తాము. క్రీస్తు పనిలో పగ, శత్రుత్వములకు స్థానము లేదు.
కృప అనే సూత్రం కోసం పోరాటం అనేది వ్యక్తిగత సమస్య కాకూడదు. అయితే, సూత్రాల ప్రాతిపదికపై ఈ వివాదము విలువైనదే. ధర్మశాస్త్రవాదము యొక్క తప్పుడు బోధనలలోనికి చొచ్చుకొనిపోవడము ఒక పెద్ద సమస్య. దీనిని మనం వ్యక్తిగతంగా దాడిగా చూడరాదు. అది క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరియు ఆయన కార్యము మీద దాడి. ధర్మశాస్త్రవాదం ప్రజలను మతబానిసత్వములోనికి తీసుకువెళుతుంది.