Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్య మైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.

 

మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది?

” థన్యత ” అనేది ఒక స్థితి  కాకుండా, ఆశీర్వాదాన్ని ఆపాదించుటను సూచిస్తుంది, ఒకరి ఆశీర్వాదాన్ని ఉచ్చరించుట. గలతీయులు కృప సువార్తను మొదట విన్నప్పుడు తాము ధన్యులమని లెక్కి౦చారు. ఆ విశ్వాసము ఏమైంది? ఆ విశ్వాసము వారికి ఇక మీదట ఉన్నట్లు కనిపించడములేదు. ఆశీర్వాదముగా భావించి వారు పౌలును మొదట స్వీకరించారు. ఏమి జరిగి౦ది? వారు ఇకపై ఆయనను, ఆయన స౦దేశాన్ని ఒక ఆశీర్వాద౦గా చూడడం లేదు, అయితే మునుపు ఆయన భౌతిక రూప౦ వారిని బాధి౦చలేదు (గలతీయులు 4:14), ఇప్పుడు ఆయన కృప స౦దేశాన్ని బట్టి వారు వికర్షి౦చబడుతున్నారు.

శక్య మైతే . . . . . మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను

గలతీయులు తమ కళ్లను పీకేయడ౦ సాధ్యమేనని పౌలు చెప్పలేదు. గ్రీకుభాషలో ” ఐతే” అంటే ” అలా జరగదు, కానీ ఒకవేళ” అని అర్థం. ” ఐతే ” అనేది ” ఒకవేళ ” అనే వాస్తవానికి విరుద్ధం. పౌలు వారు మొదటిసారిగా కృపను వాస్తవ౦గా గ్రహి౦చిన సమయ౦ గురి౦చి పరికల్పనగా మాట్లాడాడు. కొన్ని సమయాలలో వారు అపొస్తలుడైన పౌలు కోసం ఎంతకైనా తెగించేవారు. ఇప్పుడు వారు ధర్మశాస్త్రవాదులైన నాయకులను అనుసరిస్తున్నారు. వారు అస్థిరులుగా మరియు చంచలత్వము కలిగినవారుగా ఉన్నారు. వారు పౌలుపట్ల ప్రగాఢమైన ప్రేమ ను౦డి తీవ్రమైన ద్వేషానికి వెళ్ళారు. వారు ఇప్పుడు ఆయనకు శత్రువులు (గలతీయులు 4:16).

మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని

గలతీయులు పౌలు కోస౦ తమ కళ్లను ఊడబీకి ఇవ్వగలిగిన కాలము ఉండేది. ఇది పౌలు శారీరక సమస్య ఒక కంటి సమస్య అని సూచి౦చవచ్చు. పౌలు చాలా అతిశయోక్తిగా మాట్లాడవచ్చు కానీ వారు మొదట క్రైస్తవులుగా మారినప్పుడు ఆయనపట్ల తమకు చాలా ప్రేమ ఉ౦దని స్పష్టమవుతో౦ది.

“కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?”    (2 కొరింథీ 12:15)

నియమము:

మన౦ ఎప్పుడైతే కృప సూత్రాన్ని విడచిపెడతామో, మన౦ ఆధ్యాత్మిక౦గా అస్థిరులమవుతాము.

అన్వయము:

మన౦ అద్భుతమైన కృప సువార్త యొక్క దృష్టిని కోల్పోతే, మన హృదయాలు దేవుని పట్ల నీరసిల్లిపోతాయి. మన ఆసక్తి తగ్గుతుంది. ధర్మశాస్త్రవాదం ఎల్లప్పుడూ మన ఆశీర్వదకరమైన స్థితిని మరియు ఆధ్యాత్మిక సమృద్ధిని దోచుకు౦టు౦ది.

Share