Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసి వేయ గోరుచున్నారు.

 

పౌలు ఇప్పుడు గలతీయులు తన పట్ల తమ వైఖరిని మార్చుకోవాలని సవాలు విసురుతున్నాడు (గలతీయులు 17-20). చెడు ఉద్దేశాలతో మోసగించబడవద్దని ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు.

వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు

ధర్మశాస్త్రవాదులు ఆసక్తి కలిగియున్నారు. సత్యం పట్ల ఆసక్తి మంచిది, కానీ స్వార్థపూరిత ఆసక్తి అనేది మంచిది కాదు. గలతీయులను వారు వెంటాడడం స్పష్టమైన మోస౦. వారు గలతీయుల మేలు కోరడములేదు కాని తమ స్వప్రయోజనాలను చూసుకుంటున్నారు.

మిమ్మును బయటికి త్రోసి వేయ గోరుచున్నారు

” బయటకు త్రోసివేయుట” అనే పదానికి అర్థం నెట్టివేయడం. ధర్మశాస్త్రవాదులు గలతీయులను కృప నుండి బయటకు నెట్టివేయాలని తలస్తున్నారు. వారు రక్షణ మరియు పవిత్రతకు స్వీయప్రయాసను పరిచయం చేయాలనుకుంటున్నారు. అలా చేయడానికి వారు పౌలును గలతీయుల మీద ఏ విధమైన ప్రభావ౦ చూపి౦చకు౦డా నివారి౦చవలసి వచ్చి౦ది. గలతీయులు వారిని అనుసరించడమే వారి అంతిమ లక్ష్యం.

మీరే తమ్మును వెంటాడవలెనని

” వెంటాడుట ” అని రెండుసార్లు ఉపయోగించడం ధర్మశాస్త్రవాదులైన యూదుల వెనుక ఉన్న ప్రేరణను చూపిస్తో౦ది. తమ సమూహములో చేరేలా వారిని ఒప్పి౦చడానికి యూద మతస్తులు గలతీయులను ఆసక్తిగా వెంటాడుతున్నారు. వారు సత్యానికి ఆసక్తి చూపలేదు; వెంటాడడములో వారి ఆసక్తి ఉంది. ముగింపు ఒక అర్థాన్ని ఇస్తుంది. వారి ముగింపు వెంటాడడమే. వారు గలతీయులను నిజ౦గా ప్రేమి౦చలేదు కానీ వారిని కేవల౦ ఉపయోగి౦చారు. వారి వెనుక కలసిపోవడానికి ధర్మశాస్త్రవాదులు గలతీయులను వేటాడారు.

నియమము :

పొగడ్తలు ఎప్పుడూ మనలను సత్యమునకు అంధులుగా చేస్తాయి.

అన్వయము :

చాలామ౦ది అమాయకక్రైస్తవులు, ఒక విషయము సత్యమో కాదో తెలుసుకోవడానికి ఆసక్తిని తమ ఏకైక ప్రమాణ౦గా ఉపయోగి౦చుకుంటారు. ఒక వ్యక్తికి ఏదైనా విషయంలో అభిరుచి కనపడితే అది నిజమైనదే అయి ఉంటుంది అని నిర్థారణకు వస్తారు. ఇది కొన్నిసార్లు నిజం కావచ్చు, కానీ ప్రజలు దేనిపట్ల  అభిరుచిని ప్రదర్శిస్తారో దానికి ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చు. సత్యాన్ని నిర్ధారించడానికి ఈ ఒక్క ప్రమాణం లో ఉండడం అంటే సత్యం తప్ప మరేదో ఒక దాని ద్వారా తనను తాను మోసం చేసుకోవడం అనే ప్రమాదములో పడడమే.

అబద్ధ బోధకులు తమ అనుచరులను తప్పుదోవ పట్టించే సాధారణ పద్ధతి ఏమిటంటే, తమ అంశముల పట్ల ఆసక్తిని ప్రదర్శించడమే. చాలా ఆరాధనలు భావి అనుచరులపట్ల గొప్ప శ్రద్ధను చూపుతు౦టాయి. వారి నిజమైన ఆసక్తి అధికార దాహము. అధికారం కోసం తమ కోరికను సంతృప్తిపరచుకోవడానికి వారు మతస౦బ౦ధిత మార్గాలను ఉపయోగి౦చుకు౦టారు. అబద్ధ బోధకులు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అందరినీ ముఖస్తుతి చేస్తారు.

“ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పని వారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.”   (2 కొరింథీ 11:13-15)

Share