“మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను.”
మీ మధ్యకు వచ్చి
పౌలు గలతీయులతో ముఖాముఖిగా మాట్లాడడానికి పత్రిక ద్వారా కాకుండా వ్యక్తిగతంగా వారిని కలవాలనుకుంటున్నాడు.. గలతీయాలో పరిస్థితి ఎ౦త తీవ్ర౦గా ఉ౦ద౦టే, పౌలు దాన్ని మరి౦త ఖచ్చిత౦గా నిర్ధారి౦చడానికి, మరి౦త సూటిగా వ్యవహరి౦చడానికి వీలుగా అక్కడ ఉ౦డాలని కోరుకున్నాడు.
నేనిప్పుడే
ఈ వచానానికి “ఇప్పుడు” అనే పదం చాలా ప్రాముఖ్యమైన పదం. వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో సంఘము ఒక క్లిష్టమైన స్థితిలో ఉంది.
మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను
ఒక ఉత్తరములో ఒకరి మనసులోని మాటలను ఉంచడం కష్టం. పౌలు గలతీయలో వాస్తవ పరిస్థితికి తగినట్లుగా తన స్వరాన్ని మార్చాలనుకుంటున్నాడు. స్థానిక సంఘములో ఒక సమస్యా పరిస్థితిని ఎదుర్కొనే సందర్భాన్ని నాయకులు అర్థం చేసుకోవడం వివేకముతో కూడినది.
మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను
ధర్మశాస్త్రవాదములోనికి తిరిగి మరలడము పౌలును కలవరపెట్టింది. గలతీయులు కృప సూత్రాన్ని వదిలి వెళ్ళటానికి తగిన కారణం తో ముందుకు రావడానికి అతను నష్టపోయాడు. ” యెటుతోచకయుండుట ” అనే పదానికి అర్థం, వెళ్ళటానికి మార్గం లేకుండా ఉండటం మరియు అయోమయస్థితి అని అర్థం. గలతీయుల గురించి ఏమి ఆలోచించాలో పౌలుకు అర్థంకాలేదు. కృప సూత్రాన్ని ఆయన ఇంత స్పష్టంగా బోధించినప్పటికీ, వారు అంత త్వరగా దాని నుండి దూరంగా ఎలా వెళ్ళిపోయారు?
“క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.” (గలతీ 1:6-7)
నియమము :
అసత్య సిద్దాంతాన్ని ఎదుర్కోవడానికి మంచి నాయకులు తమ స్వరం మరియు సత్యం ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేస్తారు.
అన్వయము :
విశ్వాసులు అబద్ధ సిద్ధాంత౦ వైపు తిరిగినప్పుడు, మీరు వారి పట్ల దుఃఖి౦చేలా మీరు సత్యాన్ని ప్రేమి౦చగలరా? వారి అస్వభావికమైన సిద్ధాంతం మిమ్మల్ని కలవరపాటుకు లోను చేస్తుందా? సత్య౦ పట్ల ఆసక్తిగలవారు, సైద్ధా౦తిక౦గా ప్రక్కకు వెళ్ళే వారి వల్ల తాము కలవరపడతారు. సత్యాన్ని ప్రేమించే వ్యక్తులు సత్యం కోసం నిలబడుతారు. వారు చెడ్డవారగుటవలన కాదు గానీ దేవుని వాక్యాన్ని వారు గౌరవి౦చడ౦ వలన.
పరిణతి చె౦దిన క్రైస్తవ నాయకులు సైద్ధంతిక లోపాలలోనికి దూసుకొని వెళ్లి విధ్వంసాన్ని కలిగించరు. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు తమ స్వరం మరియు సత్యం ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేస్తారు.