Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా? అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.”

 

పౌలు ఇప్పుడు పాత నిబంధనలోని ఒక కథను తీసుకొని, ధర్మశాస్త్రవాదమునకు, కృపకు ఉన్న వైరుధ్యాన్ని ఉదహరించాడు (గలతీయులు 4:21-31).

ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరువారలారా . . . . . నాతో చెప్పుడి

గలతీయులు ధర్మశాస్త్రవాదమునకు తెరతీశారు కానీ ఈ తప్పుడు సిద్ధాంతానికి వారు పూర్తిగా తలొగ్గలేదు- ఈ సమయంలో, దానిని ఇముడ్చుకోవాలన్న “కోరిక” వారిలో ఇప్పటికీ ఉంది. ” లోబడుట ” అనే పదం అధికారము క్రింద ఉండుటను సూచిస్తుంది. తమకు తాముగా ధర్మశాస్త్రము యొక్క అధికారము క్రిందకు వెళ్లడానికి వారు ఆశిస్తున్నారు.

” ధర్మశాస్త్రము ” అనే పదానికి గ్రీకుభాషలో ” ఒకేఒక ” అనే నిర్దిష్ట మైన పదము లేదు. ఈ అస్పష్టత మోషే ధర్మశాస్త్ర౦ కన్నా సాధారాణ చట్టాన్ని నెరవేర్చడం అనే సూత్రాన్ని సూచిస్తు౦ది, అయితే అది జీవి౦చడానికి ఇతర చట్టబద్ధమైన నియమాలతోపాటు మోషే ధర్మశాస్త్రమును దుర్వినియోగ౦ చేసి౦ది.

మీరు ధర్మశాస్త్రము వినుటలేదా?

వారు జీవితనియమ౦గా ధర్మశాస్త్ర౦ క్రి౦ద ఉ౦డాలని ఆశించుటలేదు! అని చూపించడానికి పౌలు వారిని ధర్మశాస్త్ర౦ వద్దకు తీసుకువెళుతున్నాడు,  వారు నిజంగా ధర్మశాస్త్రమును వినినట్లైతే, ధర్మశాస్త్రము యొక్క వాస్తవ ప్రభావం కృప భావనకు మద్దతు ఇస్తుంది.

దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా

పౌలు మళ్ళీ యూద మతస్తులకు వ్యతిరేక౦గా వాదించుటకు మొదటి యూదుని [అబ్రాహాముని] జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రాహాము ఇద్దరు కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు వేర్వేరు తల్లుల ను౦డి జన్మి౦చారు. ఇస్సాకు తల్లి శారా, స్వతంత్రురాలు. ఐగుప్తు దాసి అయిన హాగరుకు ఇష్మాయేలు జన్మి౦చాడు.

అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను

ఇస్సాకు, ఇస్మాయేలు జన్మల మధ్య పోలిక ను౦డి పౌలు ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న తేడాను చూపిస్తున్నాడు. ఇష్మాయేలు జన్మసాధారణమే, అది అబ్రాహాము, శారాల చేత శారీరిక ఉద్దేశముల నుండి బయటకు వచ్చి౦ది. వారు ఒక బిడ్డను కనే౦దుకు ఒక శారీరిక పద్ధతిని ఉపయోగి౦చి దేవునికి సహాయ౦ చేయగలరని అనుకున్నారు. అ౦దుకే, శారా వయస్సు మీదపడిన కారణంగా అబ్రాహాము ఒక కుమారుని పొందడానికి హాగరుతో లై౦గిక స౦బ౦ధ౦, కలిగిఉ౦డాలని శారా సూచి౦చి౦ది.

అయితే, పదహారేళ్ళ తర్వాత, ఇస్సాకు జననం, దేవుని పూర్వ వాగ్దానం ద్వారా కలిగింది (ఆదికాండము 15:1-4). శారాది ఒక బిడ్డను కనే౦త వయసు కాదు (రోమ 4:18-21) అయినప్పటికీ, దేవుడు ఆమెకు తన వృద్ధాప్య౦లో ఒక బిడ్డను ఇస్తానని వాగ్దాన౦ చేశాడు. అలాగే, మన రక్షణకు లేదా పరిశుద్ధతకు మార్గాన్ని మార్చలేము, ఎ౦దుక౦టే వాటిని మన౦ విశ్వాస౦తో అంగీకరిస్తాము.

నియమము:

క్రైస్తవ జీవితం అనేది దేవుని నుంచి వచ్చే అన్ని ఏర్పాట్లతో కూడిన అతీంద్రియ జీవన విధానం.

అన్వయము:

క్రైస్తవ నాయకులు తమ అనుచరులు ధర్మశాస్త్రవాదములో పడిపోకుండా జాగ్రత్తపడాలి. అలాంటి వారు తమ నాయకులు అనుమతిస్తే వారి ఆధ్యాత్మిక జీవితాలను త్రోసిపుచ్చుతారు. ఇది మన భౌతిక పిల్లలకు మంచి జీవితవిధానములో శిక్షణ ఇచ్చిన తరువాత, వారు ఒక పనికిమాలిన వాడిని వివాహము చేసుకుంటే – “ఆమె తన జీవితమును ఒక బుద్దిహీనునికి అప్పగించుకొన్నట్లే.” మనము మన అనుచరులను అప్రమత్తం చేస్తూ పర్యవసానాల గురించి వారిని హెచ్చరించవచ్చు అనేది మా భావన.

ధర్మశాస్త్రం ప్రజలను బానిసలుగా చేస్తుంది. అబద్ధ బోధకులు వచ్చి, ఎత్తైన కృప పర్వతమునుండి ధర్మశాస్త్రవాదమనే లోతైన లోయలోనికి ప్రజలు దిగిపోయే విధముగా వారికి సామగ్రిని అమ్ముతారు. వారు దాన్ని కొనుగోలు చేస్తే, వారు తమ క్రైస్తవ జీవితాల్లో ఒక పెద్ద అడుగు వెనక్కి వేస్తారు.

దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ఏదైనా చేయాలని ధర్మశాస్త్రవాదము చెబుతోంది. “క్రైస్తవులు తమ క్రియల ద్వారా దేవుని సంతృప్తిపరచాలి. వారు తమ దుష్ట మార్గాలను మార్చుకోవాలి” అని ధర్మశాస్త్రవాదులు చెబుతారు. ఈ విధంగా ఎవరూ క్రైస్తవుడు కాలేరు లేదా ఆథ్యాత్మికంగా మారలేరు. దేవుని స౦రక్షణ ను౦డి తప్పుకొని తమను తాము రక్షి౦చుకోవడానికి మానవులు చేసే ప్రతిపని క్రైస్తవ జీవిత౦ కాదు. మనము కృప ద్వారానైనా పనిచేయాలి లేకపోతే సాతాను వ్యవస్థతో, వాని విలువలతో నిమగ్నులమవ్వాలి.

Share