“అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి”
అటువలె మనమును
పౌలు ఇప్పుడు మొదటి రె౦డు వచనాల ఉపమానాన్ని క్రైస్తవులకు అన్వయిస్తున్నాడు.
బాలురమై యున్నప్పుడు
గలతీయులు నియమాలతో పనిచేసినప్పుడు ధర్మశాస్త్రవాదంలో బంధించబడ్డారు. నిబంధనలకు లోబడి పనిచేసే వ్యక్తులు పిల్లల్లాగే పనిచేయాల్సి ఉంటుంది.
దాసులమై యుంటిమి
సీనాయి ను౦డి క్రీస్తు వరకు ధర్మశాస్త్ర౦ దాని క్రి౦ద ఉన్నవారిని బానిసలుగా చేసి౦ది. వారు ధర్మశాస్త్రమునకు శాశ్వత బానిసగా ఉన్న స్థితిలో ఉన్నారని గ్రీకులో సూచిస్తుంది.
లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి
“మూలపాఠములు” అనే పదం ఏదైనా మొదటి విషయాన్ని సూచిస్తుంది, దీని నుంచి శ్రేణిలోని ఇతరులు తమ వరుసను కొనసాగిస్తాయి. మూలపాఠము అనేది మూలసూత్రం. ” మూలపాఠము ” అనేది అక్షరమాలలోని అక్షరాలకు, వ్రాతకు నిర్మానాత్మకంగా ఉపయోగించబడింది. కొలొస్సయుల పుస్తక౦ ఈ పదాన్ని ధర్మశాస్త్రవాదమునకు వెనుదిరిగే వారి కోస౦ ఉపయోగి౦చి౦ది (కొలొస్సయులు 2:8; 2:20). గలతీయులు 4:3,9 లో, పౌలు కట్టుభానిసత్వాన్ని ఏర్పరచే ధర్మశాస్త్రవాదానికి ఈ పదాన్ని ఉపయోగించాడు.
“లోక సంబంధమైన మూలపాఠములు” అనే పదం ద్వారా బానిసత్వం యొక్క కాలపరిమితిని మనం చూస్తాం., కృపతో జీవి౦చే జీవిత౦తో పోలిస్తే మోషే ధర్మశాస్త్ర౦ మూలపాఠము. మోషే ధర్మశాస్త్ర౦ ప్రజలను నియమనిబ౦ధనలతో ముడిపెట్టి౦ది, అ౦తర్గత గతిశీలతతో పోలిస్తే వారిని బాహ్యబానిసత్వ౦లో ఉ౦చేలా చేసి౦ది. ప్రజలు ఎల్లప్పుడూ బాహ్య కార్యాచరనతో యెంతో సంతోషంగా ఉంటున్నారు. ఇశ్రాయేలీయుల బాహ్య నియమాలకు అన్యజనులకు ఉన్న నియమాలకు సారూప్యత ఉ౦ది.
నియమము :
కృపతో కూడిన జీవితం అంతర్గత గతిశీలతకలిగి ఉంటుంది.
అన్వయము :
ధర్మశాస్త్రమునకు మన జీవిత విధానమును అప్పగించుకున్నప్పుడు, అది మనలను ఒక బానిసావస్థకు గురిచేస్తుంది. ఇది ఒక PhD అభ్యర్థి తిరిగి ప్రాథమిక పాఠశాలకు వెళ్లినట్లుగా ఉంటుంది. అతను అనేక భాషలు తెలిసినప్పటికీ తిరిగి అ ఆ ఇ ఈ లను నేర్చుకుంటున్నాడు. క్రీస్తులో మన హక్కులను తెలుసుకున్న తర్వాత ధర్మశాస్త్రమునకు తిరిగి రావడ౦, స్వేచ్ఛ ను౦డి చట్టబద్దతలోకి తిరిగి వెళ్లడమే. అథ్యాత్మికంగా మాట్లాడితే ఇది బాల్యానికి తిరిగి వెళ్లడంవంటిదే. ఇది ఒక వయోజనుని తీసుకొని, అతనికి చిన్నపిల్లల చెడ్డీ -వేయడం వంటిది. మనము ధర్మశాస్త్రవాదనను ప్రోత్సహిస్తే మనము ప్రజలకు గోరుముద్దలు తినిపిస్తున్నాము.