Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, . . . . .ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను

 

అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు

“పూర్ణమైనది ” అంటే దేనినైనా నింపగలిగేది అని అర్థం. దేవుడు తన కుమారుని ప౦పి౦చడానికి కొ౦త సమయాన్ని కేటాయి౦చాడు. ” కాలము పరిపూర్ణమైనప్పుడు ” అనే పదబ౦ద౦ ప్రజలకు తన సమాధాన౦తో సమయ౦లోనికి దేవుని చొరబాటును సూచిస్తో౦ది. దేవుడు ఆ ముఖ్యమైన సమయ౦లో, శుభ సమయ౦లో తన కుమారుని అనుగ్రహించాడు. దేవుడు ప్రజల విమోచనకు ఖచ్చితమైన కాలనిర్ణయం చేసాడు.

 ” కాలము ” అనే పదం కాలవ్యవధి లేదా కాలపరిమానమును సూచిస్తుంది. ఒక నిర్ణీత కాల౦ ముగిసిన తర్వాత దేవుడు తన కుమారుని పంపాడు. క్రీస్తు పుట్టడానికి దేవుడు ఖచ్చితమైన సమయాన్ని నియమించాడు (దానియేలు 9:24-27). మోషే ధర్మశాస్త్ర౦ యొక్క కాల౦ ముగిసే సమయానికి, ప్రవచనత్మకమైన కీలక సమయములో క్రీస్తు వచ్చాడు.

రోమన్ సామ్రాజ్యం ప్రపంచమంతటా పాక్స్ రోమానా (రోమ్ శాంతిని) తీసుకువచ్చింది. రోమన్ ప్రప౦చమ౦తటా గొప్ప రాజకీయ స్థిరత్వ౦ ఉ౦ది. ప్రపంచమంతటా వర్తక, ప్రయాణ స్వేచ్ఛ చరిత్రలో అత్యంత గొప్ప స్థాయిలో ఉండేది. గ్రీకు భాష సామ్రాజ్యపు భాష, సువార్తను వ్యాప్తి చేయడానికి ఒక సరైన సమయంగా చేసింది. యేసు యాదృచ్ఛిక కాలములో రాలేదు; దేవుడు నిత్యత్వం నుండి రూపొందించిన ఖచ్చితమైన క్షణంలోనే ఆయన వచ్చాడు. ఈ కాల౦లో దేవుడు తన కుమారుని పంపి ధర్మశాస్త్ర౦ లోని శరతులన్నిటిని నెరవేర్చుట ద్వారా ధర్మశాస్త్రాన్ని అ౦త౦ చేసాడు.

 రోమన్ సామ్రాజ్య౦లో ఒక త౦డ్రి తన బిడ్డ యవ్వన కుమారుడుగా మారిన నిర్దిష్ట సమయాన్ని నిర్ణయిస్తాడు. త౦డ్రియైన దేవుడు కూడా తన కుమారుని లోక౦లోకి ప౦పి౦చే కాలాన్ని నిర్ణయించాడు. ఇది ప్రజలందరికీ ఒక మధుర క్షణం.

దేవుడు . . . .పంపెను

త౦డ్రి ఒక స౦కల్ప౦ కోస౦ కుమారుని పంపాడు. సాహిత్యపరంగా, ” పంపుట” అనగా ఏదో ఒక ఉద్దేశ్యం కొరకు అధికారంతో బయటకు పంపడం లేదా దూరంగా పంపడం అని అర్థం. యేసు దేవుని ను౦డి బయటికి బయలుదేరాడు. దేవుడు యేసును విమోచనా కార్యం కొరకు పూర్ణ అధికార౦తో పంపాడు. మన౦ ఆయనతోపాటు సహవారసులుగా ఉ౦డడానికి దేవుడు తన కుమారుని ప౦పి౦చడ౦ ద్వారా కాలములో జోక్య౦ చేసుకున్నాడు.

తన కుమారుని

యేసు తండ్రితో శాశ్వతకాలము ఉన్నాడు. అప్పుడు తండ్రి ఆయనను భూమిమీద కి పంపాడు. “కుమారుడు” క్రీస్తు యొక్క దైవత్వమును సూచిస్తుంది. దేవుడు ఒక “కుమారుని” పంపాడు, పిల్లవాడిని కాదు. యేసు లోక౦లోకి వచ్చినప్పుడు అప్పటికే ఆయన ఒక కుమారుడు.

“ఏలయనగా మనకు శిశువు పుట్టెను

మనకు కుమారుడు అనుగ్రహింపబడెను

ఆయన భుజముమీద రాజ్యభారముండును.

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు

నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని

అతనికి పేరు పెట్టబడును”  (యెషయా 9:6)

ఆయన స్త్రీయందు పుట్టి

” స్త్రీయందు పుట్టి ” అనే పదబంధం కన్య జననానికి సూచనగా ఉంది. శాశ్వతకాలమూ దేవుడైన యేసు, స్త్రీకి జన్మి౦చడ౦ ద్వారా మానవ శరీరాన్ని ధరించాడు. ఇది క్రీస్తు యొక్క నిజమైన మానవత్వాన్ని సూచిస్తుంది. “జననం” అనే గ్రీకు పదానికి ” మారుట ” అని అర్థం. యేసు ఒక నూతన స్థితిలోకి వచ్చాడు. ఆయన దేవుడిగా ఉన్న స్థితిలో జీవించాడు కానీ ఇప్పుడు దేవుడు మనిషి అనే స్థితిని పొందుతున్నాడు. క్రీస్తు జననం ప్రారంభం కాదు, అది ఒక స్థితి మార్పు.

ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను

యేసు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణ౦గా నెరవేర్చుటకు వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్ర౦ క్రి౦ద ఆయన జన్మించుట దేవుని కాలపట్టికలో ఉన్నది. యేసు ధర్మశాస్త్ర౦ క్రి౦ద పుట్టిన యూదుడిగా తన స్థానాన్ని తీసుకున్నాడు. దేవుని పరిపూర్ణ సమయ౦లో ఆయన ధర్మశాస్త్రానికి పూర్తిగా లోబడ్డాడు.

“క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయెుక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.౹ 3-4శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను”       (రోమా 8:2-4)

“ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను” (2 కొరింథీ 5:21)

“పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు”            (1 యొహాను 3:5)

నియమము :

చరిత్రలో అత్యంత శుభసమయం, అనంతమైన పూర్వ-ఉనికిగల దేవుని కుమారుడు మానవ శరీరంలోకి అడుగు పెట్టినప్పుడు.

అన్వయము :

క్రీస్తు కన్యక జనన౦ బైబిలులోని కీలక బోధ. యేసు మానవ తండ్రి లేకుండా ఒక యూదురాలైన తల్లికి జన్మించాడు. ఆయన ఒక ఇశ్రాయేలు పట్టణంలో జన్మించాడు. 8 రోజుల వయసున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఇతర యూద బాలురమాదిరిగానే యేసుకు సున్నతి చేశారు. ఆయన ఒక స్థానిక సమాజమందిరములో హాజరవుతూ యూదా పట్టణమైన నజరేతులో పెరిగాడు. యేసు జన్మ ధర్మశాస్త్ర౦ క్రి౦ద ఉ౦ది, అ౦దుకే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి, ధర్మశాస్త్రంక్రింద ఉన్న వారి కోసం ఆయన చనిపోయే అర్హత కలిగి ఉన్నాడు.

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు” (మత్తయి 5:17)

నిత్యము ఉనికిలో ఉన్న దేవుని కుమారుడు భూమిపై అడుగు పెట్టాలని దేవుడు నియమించిన సరియైన సమయానికి, నిర్ణయకాలములో యేసు వచ్చాడు. ఆయన దేవుని నిర్ణీత సమయాన్ని నెరవేర్చాడు. అది చరిత్రకు కీలకమైన అంశం. దేవుడు ఏ పనిని పరిణితి లేకుండా చేయడు. క్రీస్తు మొదటి రాకడ యాదృచ్ఛికం కాదు. ఆయన రాక కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి, ధర్మశాస్త్రం కోసం రూపొందించిన పూర్తి కాల కేటాయింపు ముగిసింది, మానవుల రక్షణ కార్యములో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం, నిత్యుడైన దేవుని కుమారుడు భూమిపై అడుగుపెట్టిన క్షణం. పూర్వం యేసు దేవుడు; ఇప్పుడు ఆయన దైవ-మానవుడు.

 క్రీస్తు జననం దైవ ప్రమేయం; దేవుడు యేసుప్రభువుగా ప్రత్యక్ష్యమయ్యాడు. యేసు త్రిత్వమునుండి ముందుకు వచ్చాడు. యేసుక్రీస్తు మానవునిగా చేయబడిన దేవుడు.

“పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను”   (1 తిమోతీ 1:15)

“నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;

ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.

ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను

దేవదూతలకు కనబడెను

రక్షకుడని జనములలో ప్రకటింపబడెను

లోకమందు నమ్మబడెను

ఆరోహణుడై తేజోమయుడయ్యెను”   (1 తిమోతీ 3:16)

“మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది”    (1 యోహాను 4:9-10)

Share