“మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై”
యేసు రావడానికి రె౦డు కారణాలుఉన్నాయి:
1) ధర్మశాస్త్ర౦ క్రి౦ద ఉన్న వారిని విమోచి౦చడానికి,
2) విశ్వాసికి దేవునితో ఉన్న ఆధిక్యతలన్నిటిని స్థిరపరచడానికి.
ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై
అందరూ ధర్మశాస్త్రపు తీర్పులోనికి వస్తారు. అ౦దుకే ధర్మశాస్త్రమునకు లోబడినవారిని “విమోచించుటకు” యేసు వచ్చాడు. “విమోచించుట” అనే పదానికి పూర్తిగా చెల్లించుట, తిరిగి కొనుగోలు చేయుట అని అర్థం. యేసు మనలను పాపపు బానిస సంతనుండి కొన్నారు. ధర్మశాస్త్రము ప్రకారము పాపము యొక్క జరిమానానంతటినీ ఆయన చెల్లించాడు. మనము పాపమునకు దాసులమై యుంటిమి అయితే యేసు పాపానికి మూల్యము చెల్లించుట ద్వారా పాపము నుండి మనలను విమోచించాడు (3:13). యేసు మనలను సమస్త మోషే ధర్మశాస్త్ర జీవన విధాన౦ ను౦డి, దాస్య౦ ను౦డి ఆచార నియమానికి విమోచించాడు.
నియమము :
మన౦ చేసిన పాపముల నష్టపరిహారముగా యేసు పూర్తి మూల్య౦ చెల్లి౦చాడు.
అన్వయము :
ధర్మశాస్త్రం మనపై పెత్తనం చేస్తే, మనము ధర్మసాస్త్రపు అధికారము క్రింద ఉంటాము. క్రీస్తు సిలువపై తన మరణం ద్వారా జీవనియమంగా మనలను ధర్మశాస్త్రం నుండి విముక్తి చేశాడు. మనము ధర్మశాస్త్రమునకు తిరిగి మరలినట్లయితే మనము తిరిగి ఆథ్యాత్మిక బాల్యానికి మరలినట్లే.
మన౦ చేసిన పాపముల నష్టపరిహారముగా యేసు పూర్తి మూల్య౦ చెల్లి౦చాడు. మనం దేవుడితో ఋణములో లేము. యేసు ఏ రసీదును కూడా చెల్లించకుండా విడిచిపెట్టలేదు. ఆయన ఒక్కసారిగా వెల చెల్లించాడు. విశ్వాసికి నరకాన్ని నిత్యముగా సంహరించాడు. మనుష్యకుమారులు దేవునికుమారులుగా మారలని దేవునికుమారుడు మనుష్యకుమారునిగా మారాడు. నన్ను దేవుని కుమారునిగా చేయడానికి దేవుని కుమారుడు ఇంత చెల్లించవలసివచ్చింది.