Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై

 

మనము దత్తపుత్రులము కావలెనని

దేవుడు మనలను “కుమారులుగా” ఒక బహుమతిగా స్వీకరిస్తాడు (దత్తతతీసుకున్నాడు). దేవుడు తన కుమారుని ద్వారా మనలను విమోచించడం వలన మనకు కుమారత్వాన్ని ఇస్తాడు. మన౦ స్వతంత్ర౦గా ఆధిక్యతలు కలిగిన కుమారులుగా ఉ౦డడానికి దేవుడు తన కుమారుని ప౦పి౦చాడు.

గ్రీకుభాషలో “దత్తత” అనే పదం రెండు పదాల సమ్మేళనం: కుమారుడు మరియు ఉంచడం. దేవుడు మనలను తన కుటు౦బ౦లో కుమారులుగా ఉ౦చాడు. యుక్తవయస్సులో నియుక్తుడైన ఒక కుమారుడు తన మగతనాన్ని (తోగా విరిలీస్) పొందిన కాలాన్ని సూచించే సాంకేతిక పదం ఇది. ఇక్కడ ” పుత్రులు” అంటే యౌవన కుమారులు అని అర్థం, చిన్నపిల్లలు అని కాదు. మనవాడుకాని ఒక పిల్లవాడిని తీసుకొని చట్టబద్దంగా వానిని కుటుంబములో ఒకనిగా చేసుకొనే 21వ శతాబ్దపు దత్తత తీసుకునే పద్దతిని ఇది సూచించడంలేదు. బైబిలులోని దత్తత ఇప్పటికే కుటుంబంలో ఉన్న వ్యక్తిని తీసుకొని వయోజన ప్రత్యేక హోదాలో వారిని ఉంచుతుంది.

క్రైస్తవుడు అప్పటికే కుటు౦బ౦లో ఉన్నాడు, కానీ కుమారుని స్థానాన్ని పొందినప్పుడే కుటు౦బ వారసునిగా ఆధిక్యతను పొందుతాడు. యేసు మనలను దేవునితో ఆధిక్యత స్థాన౦లో ఉ౦చాడు. సిలువపై క్రీస్తు చేసిన కార్యమువలన దేవుడు మనలను ఆధ్యాత్మిక వయోజనుడి హక్కులోకి చేర్చాడు. ఇది సహజమైన సంతతి ద్వారా మనకు లభించని ఒక ఆధిక్యత.

“దత్తత” అనేది యధాతథ స్థితి యొక్క పదం, ఇది దేవునితో చట్టపరమైన హోదా యొక్క పదం. దేవుడు మనలను కుమారత్వములోనికి స్వీకరించినప్పుడు, దానితోకూడా మనకు అన్నీ ఆధిక్యతలు లభిస్తాయి. ఆయన మనలను ఒక కుమారుని హక్కులో చేర్చుకు౦టాడు. ఆయన మనలను ప్రత్యేక హోదాలో ఉంచుతాడు. ధర్మశాస్త్రవాదులు సంరక్షకుల మరియు గృహనిర్వాహకుల కింద జీవిస్తున్నారు కానీ దేవుడు కృపలో విశ్వాసులకు క్రీస్తు యొక్క పూర్తి స్థితిని ఆమోదిస్తున్నాడు. క్రీస్తును స్వీకరించే ప్రతి ఒక్కరికి ఏ చిక్కులు లేకుండా పూర్తిగా కుమారత్వాన్ని ఆయన ఇస్తున్నాడు.

నియమము :

సిలువపై ఆయన మరణం కారణంగా దేవుడు మనలను క్రీస్తు యొక్క సమాన స్థితిలోఉంచాడు.

అన్వయము :

ఒక క్రైస్తవుడు జీవిత విధాన౦గా ధర్మశాస్తం వైపు ఎందుకు మరలాలి? మనకు అతీతమైన మానవాతీతమైన ఆధిక్యత ఉన్నప్పుడు చేయదగిన, చేయదగని పనులు అనే దిగువ స్థాయిలో ఎందుకు జీవించాలి? యేసు ఇప్పటికే మన కోస౦ ఆ స౦పాదన చేశాడు కాబట్టి మన౦ దేవుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయాసపడవలసిన అవసరం లేదు. తండ్రి ముందు ఆయనకు ఉన్న హోదా మనకు కూడా ఉంది – ఆయన హక్కులు మన హక్కులు. దేవుని కుమారుని హక్కులను ఉపయోగించుకునే చట్టబద్దత మనకు ఉంది. ఈ హక్కులు ఏమాత్రం మనం సంపాదించుకున్నవి కాదు. సిలువ న్యాయవిచారణ ద్వారా యేసు వాటిని సంపాదించాడు. అందుకే ప్రార్థన చేసే స్వతంత్రత, దేవుని ముందు ఆధ్యాత్మిక జీవితాన్ని అభ్యసించే స్వతంత్రత మనకు ఉంది.

ఆధ్యాత్మిక వయోజన కుమారుడు తన ఆధ్యాత్మిక ఆస్తి యొక్క స్వతంత్ర కార్యనిర్వాహకుడుగా మారుతాడు. తనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ కారణంగా చట్టపరమైన నియమాలను దాటి దేవునితో తన స౦బ౦ధ౦లో ముందుకు సాగుతాడు. దేవుని ఎదుట మన౦ భయ౦తో బానిసగా ఉ౦డడానికి ఏ కారణమూ లేదు. ఆయనను మనము స్వతంత్రంగా సేవిస్తాము.

“ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి”    (గలతీ 5:1).

నిశ్చయత మరియు నమ్మకము అనేవి దేవుని ఎదుట తమ స్థిరత్వం తెలిసిన వారి లక్షణాలు. మనము దేవుని యెదుట యోగ్యతను స్థాపించలేము కాని మన పిలుపులో [దేవుని యెదుట] “యోగ్యులమై నడువవలసిన ” బాధ్యత మనకు ఉంది (ఎఫెసీయులు 4:1-3; కొలొస్సయులు 3:1-3).

దేవుని ఎదుట మన౦ చేసే విజ్ఞాపనలకు ప్రాథమిక ఆధార౦ మన ఆధ్యాత్మికత కాదు; క్రీస్తునందు మన స్థానము. మన౦ ఆధ్యాత్మిక౦గా ఉ౦డడ౦ వల్ల దేవుడు మన విన్నపములను ఆలకించడములేదు గానీ, ఆయన యెదుట క్రీస్తులో వ్యవహారికంగా, న్యాయపరముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము గనుక ఆలకిస్తున్నాడు.

తాము దేవునిచేత అంగీకరింపబడరేమో అని అనుమానము కలిగి కొందరు ఆయన యెదుట నడుస్తుంటారు. క్రీస్తు తమ అపరాదముల కోస౦ చనిపోయాడనే వాస్తవాన్ని అ౦గీకరి౦చకు౦టే వారు అపరాదభావముతో నడుస్తారు. తాము చేసిన పాపాలకు తాము అపరాదులు అనే వాస్తవాన్ని అంగీకరించాలి. కాని అపరాధ భావాలతో ఆ పాపానికి వారు తగిన మూల్యం చెల్లించకూడదు. క్రీస్తు తమ పాపములకు వెల చెల్లించాడని గుర్తించే బదులు వారి అపరాదములకు వారే చెల్లిస్తున్నారు. వారు నిజానికి ఇలా అ౦టున్నారు, “యేసును తప్పించండి, నేను సిలువపైకి ఎక్కి నా తప్పుకు శిక్ష అనుభవిస్తాను.” అది సిలువపై క్రీస్తు ముగించిన కార్యాన్ని తిరస్కరించడమే. వీరు దేవుని ఎదుట తమ హక్కులను గుర్తించరు. క్రీస్తు తమ పాపములకై శ్రమపడినప్పటికీ వారు ఇంకా తమ ఆపరాధముల కొరకు క్షోభిస్తుంటారు.

Share