“మరియు మీరు కుమారులై యున్నందున–నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.”
పరిశుద్ధాత్మ మన హృదయాలలో మొఱ్ఱపెట్టును గనుక మనము దేవుని కుమారులము అని ఈ వచన౦ దైవిక౦గా ఆమోదిస్తుంది.
మరియు మీరు కుమారులై యున్నందున
మన హృదయాలలో నివసిస్తూ మొఱ్ఱపెడుతున్న పరిశుద్ధాత్మను మనము కలిగియున్నాము గనుక మనము ఆయన కుమారులము అని దేవుడు మనకు రుజువు చేస్తున్నాడు. ఇది కుమారత్వము యొక్క స్పష్టమైన వాస్తవం. కుమారులు కాని వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వడు ఎందుకంటే, కుమారుని-స్థానానికి రుజువు పరిశుద్ధాత్మ యొక్క నియామకమే. మనలను “కుమారులనుగా” చేయట సిద్ధాంతమును మించినది – ఎందుకంటే దేవుడు తన కుమారుని జీవమునే మన హృదయాలలో స్థిరపరిచాడు.
తన కుమారుని ఆత్మను దేవుడు . . . . పంపెను
తండ్రి యైన దేవుడు “తన కుమారుని పంపడమే గాక, ఆయన “తన కుమారుని ఆత్మ”ను, అనగా పరిశుద్ధాత్మను పంపాడు. త్రిత్వములో ఆయన మూడవ వాడు. ఈ విధంగా పూర్ణత్రిత్వము మన రక్షణపై పనిచేస్తుంది. కుమారత్వము మూలముగా పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన వరం. దేవుని కుమారులు లేక కుమార్తెలు పరిశుద్ధాత్మ లేకుండా ఉండరు.
దేవుడు తన కుమారుని “ప౦పి౦చాడు” ఆ తర్వాత ఆయన “తన కుమారుని ఆత్మను ప౦పించాడు.” ” పంపుట ” అనే పదానికి అధికారికంగా పంపడమని అర్థం. ధర్మశాస్త్రం అను గృహనిర్వాహకుడు మరియు సంరక్షకుల స్థానాన్ని స్వీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుని అధికార ప్రతినిధి.
మన హృదయములలోనికి
దేవుడు ఆత్మను ” మన హృదయములలోనికి ” పంపుతాడు. ధర్మశాస్త్రం బాహ్య సంబంధాలను ప్రభావితం చేయగలదు మరియు పాలించగలదు కానీ పరిశుద్ధాత్మ మానవుని అంతర్గత స్వభావాన్ని నియంత్రిస్తుంది.
నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు
పరిశుద్ధాత్మ క్రైస్తవుని “అబ్బా, తండ్రి” అని మొఱ్ఱపెట్టుటకు పురికొల్పుతుంది. “అబ్బా” అనేది “తండ్రి” అని అర్థమిచ్చు ఒక అరామిక్ పదం, ఇది ఒక ప్రియమైన పదం. పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవుడు ఈ మొఱ్ఱపెట్టలేడు. ఆత్మ మనలో నివసిస్తున్నాడనుటకు ఇది నిదర్శనం. నిజమైన కుమారులు, కుమార్తెలు తమ తండ్రికి మొఱ్ఱపెడుతారు గనుక ఆయన మనలో నివశిస్తున్నాడని వ్యక్తిగతంగా మనకు తెలుసు.
“దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు” (రోమా 8:9)
“దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము” (రోమా 8:14-17)
నియమము :
క్రైస్తవుని జీవితములో పరిసుద్ధాత్మ సన్నిధి ద్వార రక్షణ నిశ్చయతను దేవుడు అతనికి ఇస్తాడు.
అన్వయము :
దేవుని కుటు౦బ౦లో మన స్థానమును రుజువు చేయడానికి పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసి హృదయ౦లో ఉన్నాడు.
మనం దేవుడి బిడ్డగా మారినప్పుడు, దేవుడు మనలను దేవుడి బిడ్డగానే కాక, కుమారునిగా స్వీకరిస్తాడు. బాల్యం దేవునితో మనకున్న సంబంధం గురించి మాట్లాడుతుంది; కుమారత్వము దేవుని కుటుంబంలో వయోజకులుగా మన ఆధిక్యతలు గూర్చి తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహము క్రైస్తవునికి దేవుని అంగీకరించడానికి విశ్వాసాన్ని ఇస్తుంది. మనము ఏమియైయున్నామో యేమి చేస్తున్నమో వాటిని బట్టి దేవుడు మన అంగీకారాన్ని ఆమోదించడు కానీ యేసు యేమైయున్నాడో ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన ఆమోదిస్తాడు. మన౦ ఇకపై దేవుని న్యాయాధిపతిగా చూడము, త౦డ్రిగా చూస్తాము. పరిశుద్ధత అను సంపద దేవుని కృప యొక్క త౦డ్రి- కుమారుల స౦బ౦ధాన్ని ప్రదర్శిస్తో౦ది.
యేసు తన స్థానాన్ని ఈ లోక౦లో విడిచిపెట్టినప్పుడు, ఆయన స్థాన౦లో పరిశుద్ధాత్మ వచ్చాడు. మనం పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్నాం. దేవుడు నేడు దేవుని వాక్యము నుండి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆకలి గా ఉన్నప్పుడు మనం తల్లడిల్లవలసిన అవసరం లేదు. దేవుని అనుగ్రహాన్ని పొందడానికి మన౦ మోకాళ్లపై ప్రాకవలసిన అవసరం లేదు. మనం చెప్పవలసిందల్లా ” తండ్రీ, నేను ఆకలితో ఉన్నాను. నాకు బట్టలు కావాలి”. ఆయన దృష్టిని మనపై మరల్చడానికి మన చాతీపై బాదుకుంటూ చేతులను కోసుకొని గాయపరచుకోనవసరము లేదు. పరిశుద్ధాత్మ మనలో నివశిస్తున్నాడు గనుక ఆయనకు తెలుసు, అర్థంచేసుకుంటాడు.
మనము ప్రార్థించే ఆధిక్యత ఎంత సేపు ప్రార్థిస్తామో కాదు. అది మన చిత్తశుద్ధి కాదు. అలాగే విశ్వాసి జీవితంలో దేనిమీదా ఆధారపడదు. యేసు క్రీస్తు మానవావతారములో చేసిన కార్యముమీద మనము ప్రార్ధన చేసే ఆధిక్యత ఆధారపడి ఉంది – ఆయన మనకు తన సమాన హోదాను నిత్యమూ దేవుని ముందు ఇచ్చాడు. ఆయన దేవునికి పూర్తిగా ఆమోదయోగ్యుడు, కాబట్టి మనం కూడా దేవునికి పూర్తిగా ఆమోదయోగ్యులము.
“మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము” (హెబ్రీ 4:16)