“కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.”
కాబట్టి
పౌలు కుమారత్వము అను తన వాదన సారాంశాన్ని “కాబట్టి” అనే పద౦తో ముగి౦చాడు.
నీవిక
” నీవు ” అనే పదం ఏకవచనంలో ఉంది, ఇది గలతీయులకు చాలా వ్యక్తిగతంగా అన్వయిస్తుంది.
దాసుడవు కావు కుమారుడవే
విశ్వాసి ధర్మశాస్త్ర౦ క్రి౦ద దాసుడు కాదు గానీ కృపయందు దేవునితో వయోజన ఆధిక్యతగల కుమారుడు. క్రైస్తవుడు “కుమారుడు” కాబట్టి ధర్మశాస్త్ర౦ ను౦డి విముక్తుడు. కుమారత్వము వారసుడుగా ఉండే ఆధిక్యతను తెస్తుంది. గలతీయులు ధర్మశాస్త్ర బానిసత్వ౦ ను౦డి విముక్తిని పొందారు.
కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు
మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి-వారసులము.
“మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తు తోడి వారసులము” (రోమా 8:16-17)
నియమము :
మన౦ దేవుని కుమారులము కాబట్టి, దేవుని వనరులకు వారసులము.
అన్వయము :
క్రైస్తవులు క్రీస్తుతో సహ-వారసులు. వివాహితుల్లో చాలా మందికి ఉమ్మడి బ్యాంకు ఖాతాలుంటాయి. తరచుగా యువ జంటలు వివాహం చేసుకున్నప్పుడు చేసే మొదటి పని ఉమ్మడి ఖాతా తీసుకోవడం. వారు తమ మొత్తం ఆస్తులను ఒక పెద్ద మొత్తములో ఖాతాలో వేస్తారు. అది 50/50 అకౌంట్ అని వారు భావిస్తారు. 50 శాతం ఆమెది, 50 శాతం అతనిది. అయితే, అది ఆ విధంగా పనిచేయదు. ప్రతిసారీ లావాదేవీలలో అతను ఆమెకంటే పైచేయి కలిగియుంటాడు. క్రీస్తుతో మన ఉమ్మడి ఖాతా 50/50 ఒప్పందం కాదు. ఆయన సంపదలన్నిటిపై మనముకూడా పూర్ణ అధికారము కలిగియున్నాము. దేవునితో నీవు కలిగియున్న ఖాతాతో సరితూగే ఆథ్యాత్మిక చెక్కులను నీవు వ్రాస్తున్నావా?
యేసు క్రీస్తు మనకొరకు మానవావతారములో చేసిన కార్యము వెలకట్టలేనిది. మనుష్యకుమారులు దేవునికుమారులుగా మారుటకు దేవునికుమారుడు మనుష్యకుమారునిగా మారాడు. మనమున్న స్థలమునుండి తాను నిత్యము నివశించు స్థలమునకు మనలను లేవనెత్తి చేర్చుటకు, క్రీస్తు తానున్న స్థలమునుండి మనమున్న స్థలమునకు దిగివచ్చాడు.
క్రీస్తు సమస్తమునకు వారసుడు (హెబ్రీ 1:1,2). వారసునిగా ఆయన ఆధిక్యత తన కుమారత్వముపై ఆధారపడి ఉంది (రోమీయుల 8:16,17); ఆయన తండ్రి కుమారుడు కనుక ఆయన వారసుడు. మనము క్రీస్తు యొక్క వారసులము మరియు నిత్యజీవమునకు వారసులము (తీతు 3:7); క్రీస్తు వారసునిగా చేయబడితే మనము నిత్యజీవమునకు వారసులమవుతాము. క్రీస్తు వారసులు ఆయన స్వాస్థ్యములో పాలుపంచుకుంటారు (ఎఫెసీయులకు 1:11). తండ్రి క్రీస్తును, మనలను నిత్యత్వమునుండి ఎన్నుకొన్నాడు (హెబ్రములు 9:15). కాబట్టి మన౦ యేసు యొక్క ఎన్నికను మరియు స్వాస్థ్యమును పాలుపంచుకోవాలి. ఇది మన నిత్య రక్షణకు హామీ ఇస్తుంది (1 పేతురు 1:4,5).
దేవుడు ఎల్లప్పుడూ తన కృప ఆధారంగా మనలను వారసులనుగా చేస్తాడు (గలతీయులు 3:29). పరిశుద్ధాత్మ మన నిత్యస్వాస్థంపై ముందస్తు చెల్లింపు (గలతీయులు 4:6; ఎఫెసీ1:14).