ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.
ఈ ప్రేరేపణ
” ఈ ప్రేరేపణ” ధర్మశాస్త్రవాదము. ధర్మశాస్త్రవాదము దేవుని నుండి రాలేదు.
మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.
దేవుడు ధర్మశాస్త్రవాద రచయిత కాదు ఎందుకంటే ఆయన కృప రచయిత. రక్షణ దేవుని పని మరియు ఇది కృప యొక్క పని. దేవుడు గలతీయులను కృప మరియు దయతో మాత్రమే పిలిచాడు.
“క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.”(గలతీయులు 1: 6-7).
నియమము:
దేవుడు ఎల్లప్పుడూ కృపతో మనలను పిలుస్తాడు.
అన్వయము:
క్రీస్తు పనికి మనం ఏదైనా జోడించినప్పుడల్లా, కృప యొక్క సువార్త యొక్క అలొచనపై దాడి చేస్తాము. కృప అంటే క్రీస్తు మరణం మాత్రమే రక్షణకు చెల్లించడానికి సరిపోతుంది. ఇది క్రీస్తు ప్లస్ బాప్టిజం లేదా చర్చి సభ్యత్వం లేదా మంచి పనులు కాదు. మానవ స్వభావం దేవుని పనిలో పాలుపంచుకోవాలనుకుంటుంది కాని ఈ నమ్మకం దెయ్యం యొక్క అబద్ధం. మన రక్షణకు లేదా పవిత్రీకరణకు దేవుడు అన్ని ఘనతలు పొందాలని మనము కోరుకోము.