Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీకరించితిరి.

 

అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు

పౌలు సువార్త ప్రకటి౦చడానికి గలతీయకు వచ్చినప్పుడు, ఆయన రూప౦లో వికారమును కలిగి౦చే ఒక వ్యాధి వచ్చి౦ది. ఆయన రూపం ఎలా ఉన్నప్పటికీ, గలతీయులు ఆయనను సాదరంగా స్వీకరి౦చారు.

పౌలు తన రాకకు గలతీయుల ప్రతిస్ప౦దనను వర్ణి౦చడానికి రె౦డు పదాలను ఉపయోగి౦చాడు: వారు ఆయనను “తృణీకరి౦చలేదు” లేదా ” నిరాకరి౦చలేదు” అని చెప్పాడు. “తృణీకరించు” అనే పదానికి అలక్ష్యం చేయుట, ఏహ్యభావము కలిగియుండుట అని అర్థం. వారు ఆయనను పట్టించుకోకుండా లేరు. ఆయన అనారోగ్యం కారణంగా వారు ఆయనను చిన్నచూపు చూడలేదు. గలతీయులు ఆయన రూపాన్ని అధిగమించి చూసారు.

రెండవ పదం ” నిరాకరించు ” అనే పదం రెండు పదాలతో చేసిన ఒక సమ్మేళన పదం : ఉమ్మివేయట మరియు బయటకు. అతను వచ్చినప్పుడు వారు ఉమ్మివేయలేదు. వారు ఆయనను గాని, ఆయన స౦దేశాన్ని గాని అసహ్యించుకోలేదు.

పౌలు చాలామ౦దిని స్వస్థపరచాడు, ఆయన స్వస్థత పొ౦దలేకపోయాడు. ఆయన క్రీస్తును వికలాంగునిగా ఉండి ప్రకటించాడు. దేవుడు తన పరిచర్యలో దేవునిపై ఆధారపడేవిధంగా ఈ బలహీనతను అతనిలో ఉంచాడు (2 కొరింథీయులకు 12:9-10).

గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీకరించితిరి

పౌలు గలతీయకు వచ్చినప్పుడు గలతీయులు ఆయన పట్ల ఎ౦తో గౌరవాన్ని చూపి౦చారు. ” అంగీకరించుట ” అనే పదానికి అహ్వానించుట అని అర్థం. వారు అతన్ని సహించడమే కాదు, అతనిని హత్తుకున్నారు. ఆయన స౦దేశాన్ని వారు చూసే విధాన౦పై ఆయన రూప౦ ప్రభావ౦ చూపి౦చలేదు.

గలతీయులు పౌలును క్రీస్తు ప్రతినిధిగా “క్రీస్తుయేసువలె” స్వీకరించారు. పౌలు అ౦ద౦గా లేడు. ఆయనకు గొప్ప వ్యక్తిత్వం ఉన్నదనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అతను పరిచయకర్తలు మరియు బహిరంగ ప్రకటనలు లేకుండా ఒక అపరిచితుడుగా గలతియాకు వచ్చాడు. అతనిలో ఆకర్షణలు లేవు. ఆయనకు దేవుని వాక్య౦ తప్ప మరేమీ లేదు.

“అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.”     (2 కొరింథీ 10:10)

నియమము :

అధిగమించలేని అడ్డంకులతో ఉన్న ప్రజలను దేవుడు ఉపయోగించుకుంటాడు.

అన్వయము :

గొప్ప వ్యక్తిత్వం తో ఆకర్షణీయంగా ఉంటే తప్ప క్రీస్తు సేవకులుగా ఉండలేరని కొందరు భావిస్తారు. ప్రభువు సేవలో అద్భుతమైన వరాలు పొందిన వారు చాలా తక్కువ. మనలో చాలామందికి అన్ని వనరులు లేవు. దేవుడు పరిమితులతో ఉన్న ప్రజలను కూడా ఉపయోగిస్తాడు.

దేవుడు ప్రచార సామర్ధ్యం మరియు అందంగా ఉన్న వ్యక్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దేవుడు తన సందేశమును అందించడానికి గొప్ప వ్యక్తిత్వములను కూడా అధిగమిస్తాడు. గోధుమ రంగు పేపర్ బ్యాగ్ లో ఉండే వజ్రాల హారము అందమైన బాక్సులోని వజ్రాల హారము వలే విలువైనది.

Share