Select Page

యాకోబు పత్రిక వచనము వెంబడి వచనము వ్యాఖ్యానం

యాకోబు పత్రిక ఉపోద్ఘాతము

డా. గ్రాంట్ సి రిచిసన్

(అనువాదము : డేవిడ్ నల్లపు)

 

రచయిత

యేసు యొక్క సోదరుడు(మత్తయి 13:58; మార్కు 6:3)

ప్రారంభములో యేసును యాకోబు మెస్సయగా అంగీకరించలేదు (మత్తయి 12:46-50; మార్కు 3:21,31-35; యోహాను 7:3-9, ప్రత్యేకించి యోహాను 7:5). అయినప్పటికి, ఆపో.కార్యములలో యాకోబు యేసుపట్ల అకస్మాత్తుగా  హృదయపరివర్తన చెందాడు.

   • యాకోబులో జరిగిన పరివర్తన గురించి వివరణ : మానవుడు – పునరుర్ధానము (1 కొరిం15:7)

యెరూషలేము సంఘముకు నాయకుడైయ్యాడు (పేతురు కాదు).

పేతురు చెరసాలనుండి తప్పించబడిన వర్తమానమును యాకోబుకు పంపెను (ఆపో 12:17)

యెరూషలేములోని సభకు పెద్దగా వ్యవహరించాడు (అపో 15:13-21)

పౌలు క్రైస్తవునిగా మార్పుచెందాక మొదట యెరూషలేముకు వెళ్ళి పేతురు యాకోబును కలుసుకున్నాడు.  (గలతీ 1:19; 2:9).

పౌలు యాకోబునొద్దకు కానూకలు తీసుకుని వెళ్ళాడు (అపో 21:18-25), పౌలు స్పష్టంగా యాకోబును ఎంతాగానో గౌరవించాడు.

 యూదా యాకోబును ప్రభువు యొక్క సోదరునిగా పెర్కున్నాడు. (యూదా 1).

James అనగా యాకోబు.”

గ్రహీతలు — రోమా సామ్రాజ్యంలో చెదరిన 12 గోత్రముల ఇస్రాయేలు క్రైస్తవులు (క్రైస్తవ యూదులు)  (1:1).

 • అపొ.కా 12 వ అధ్యాయములో హింస జరిగినప్పుడు వారు చెదరియుండవచ్చు.
  • ఉద్దేశము : మృతమైన ఆచారాలు వెంబడించుటను వెలుగులొనికి తెచ్చుట. ( క్రియలులేని విశ్వాసము)
 • భక్తి క్రియలతొ సరితూగాలి
 • సరైన ఆలోచనవిధానము , సరైన విశ్వాసము సరైన క్రియలతొ సరిపోల్చబడాలి.
 • క్రైస్తవులు సిద్దాంత్తాన్ని, అనుసరణను వేరుచేయకూడదు.

అంశము : విశ్వాసము క్రియజరిగించును

సజీవమైన విశ్వాసము వర్సెస్ సైద్ధాంతిక నమ్మకం క్రియాకలాపం

 • విశ్వాసము దెవునివాక్యముతొ నడిపించబడే జీవితాన్ని పుట్తిస్తుంది.
 • దేవుని వాక్యమునుండి దూరముగా వెళ్లు జీవతం విశ్వాసాన్ని తిరస్కరిస్తుంది.
 • క్రియల వలన రక్షణదేవునివాక్యవిరుద్దము
 • నైతికత క్రైస్తవ్యము యొక్క ఉప ఉత్పన్నం
 • విధేయత విశ్వాసమునకు సంకేత పదము

కాలము: క్రీ. శ.  45-49

మూలవచనము : 2:17

నేపధ్యము మరియు గమ్యము:

A సిరియనుల చెరలొనికి ఇశ్రాయేలు, 721 B.C.లొ వెళ్ళింది.

588 B.C. లొ యూదా బబులోను చెరలొనికి వెళ్ళింది.

అలగ్జాండర్ ది గ్రేట్ అనేక యూదులను ఈజిప్ట్ లో ముఖ్యముగా అలగ్జాండ్రియా ఈజిప్ట్ లో ఉంచాడు.

వ్యాపార అవకాశాలకొరకు అనేక యూదులు ఇతర దెశాలకు చెదరిపోయారు. (యాకోబు 1:1).

చెదరినవారు తిరిగివచ్చినపుడు వారిలొని భిన్నత్వాన్ని గమనించండి. (అపో 2:9-11; 6:9).

పుస్తకము యొక్క గుణములు :

ఏ క్రొత్తనిబంధన పుస్తకము ఇంతగా యూదులకు సంబందించిందిగా ఉండదు. 

యాకొబు పత్రిక పాతనిబంధన మరియు కొండమీది ప్రసంగము యొక్క వ్యాఖ్యానము

యాకొబు పత్రిక స్పష్టంగా కొండమీది ప్రసంగము మీద ఆధరపడి ఉంది

ప్రకృతి నుండి తీయబడిన ఉదాహరణలు (1:6,10,11; 3:4,5,7,12; 4:14; 5:2,3,7,18)

108 వచనములలో 54 అత్యవసరాలు [ఆదేశాలు] కలవు.

యాకోబు పత్రిక మొదట వ్రాయబదిన క్రొత్తనిబంధన పుస్తకము.

అధ్యాయలు; 108 వచనములు

క్రీస్తు పేరు రెండుసార్లు మాత్రమే కనిపిస్తుంది.

శరీరధారణ లేదా పునరుత్థానం గురించి ప్రస్తావించలేదు.

క్రియలవలన నీతిమంతులుకాగలము అని ఈ పత్రిక బోధిస్తుంది అని భావించి, మార్టిన్ లూథర్ యాకొబు పత్రికను “బలహీన పత్రిక” గా అభివర్ణించాడు.

యాకోబు ఒక సాధారణ పత్రిక(హెబ్రీ, పేతురు, యొహను పత్రికలు వలె) యూదా అనేక ప్రాంతాలలొ ఉన్న విశ్వాసులకు వ్రాసాడు.

ఒక సమూహము నుండి మరొక సమూహముకు యాకొబు పత్రిక పౌరాణికంగా అందించబడాలి.

పద్దతి: లేఖ నిర్మాణములొ హెచ్చరిక

యాకోబు తన పాఠకులను “సహొదరులు” అని 15 మారులు సంభోదించాడు.

ఇతర పుస్తకాలకన్నా యాకోబు , మన భ్యాహ్య జీవితము గురించి ఎక్కువగా వ్యవహరిస్తుంది.

దేవుని వాక్యము మన శీలము, ప్రవర్తనను చూపించే మన అద్దము

కార్యము జరిగించే వాడే నిజమైన శ్రోత. అంతరంగములొని ప్రేమ ఫలిస్తుంది.

 పత్రిక రచించిన సందర్భము :

మొదటి శతాబ్దములొ చదరినప్పుడు క్రైస్తవులు హింసను అనుభవించి, స్వనీతిగల పరిసయ్యుల క్రింద జీవించారు. పాపము క్రియకంటె ఎక్కువైనదని పాపము యొక్క స్వభావమును యాకొబు నిర్వచిస్తాడు. కనుక,  పాపము ఒక ఉద్దేశ్యం ద్వారా నియంత్రించబడే వైఖరి అని చూపించుటకు కొండమీది ప్రసంగమును ప్రస్తావిస్తాడు.

 పౌలు యాకోబుల నీతిమత్వము యొక్క వ్యత్యాసాలు:

పౌలు : దేవుని యెదుట నీతిమత్వము

యాకోబు : మానవుని యెదుట నీతిమత్వము

విశ్వాసము నీతిమత్వముకు మూలము

క్రియలు నీతిమత్వముకు ఫలము

విశ్వాసముకు  నీతిమత్వము కారణము

క్రియలు నీతిమత్వముకు ఫలితము

 కొండమీది ప్రసంగము మరియు యాకోబు పత్రికల మధ్య పోలిక :

 

–  యాకోబు 1:2 మత్తయి 5:10-12 

యాకోబు 1:4   మత్తయి 5:48       

యాకోబు 1:5మత్తయి 7:7     

యాకోబు 1:9 మత్తయి 5:3     

యాకోబు1:12 మత్తయి 7:14  

యాకోబు1:20మత్తయి 5:22  

యాకోబు1:22మత్తయి 7:24  

యాకోబు2:5 మత్తయి 5:3  

యాకోబు2:10 మత్తయి  5:19  

యాకోబు2:13 మత్తయి 5:7  

యాకోబు3:10-12 మత్తయి 7:15

యాకోబు3:6 మత్తయి 5:22  

యాకోబు3:18 మత్తయి 5:9  

యాకోబు4:4 మత్తయి 6:24  

యాకోబు4:10 మత్తయి 5:5  

యాకోబు4:11,12 మత్తయి 7:1-5  

యాకోబు5:2f మత్తయి 6:19  

యాకోబు5:10 మత్తయి 5:12  

యాకోబు5:12 మత్తయి 5:33-37

 

 యాకొబు పత్రిక పరివర్తన స్వభావము 

ప్రారంభ అపోస్టోలిక్ సంఘములో పరివర్తన సమయంలో యాకోబు రాశాడు. కాలక్రమానుసారం క్రొత్త నిబంధన ప్రారంభంలో నిలబడి ఉన్నందున, తరువాతి క్రొత్త నిబంధన రచయితలు అభివృద్ధి చేసిన  సంపూర్ణసిద్ధాంత పరిధిని ఈ పుస్తకం కలిగిలేదు. 

ముఖ్యాంశాలు

అభివందనము 1:1

విశ్వాసపు పరీక్ష 1:2-27

విశ్వాసపు స్తిరత్వము, 1:2-11

విశ్వాసపు ఓర్పు, 1:12-18

విశ్వాసపు క్రియ, 1:19-27

విశ్వాస స్వభావము, 2:1-3:12

విశ్వాసము తారతమ్యము చూపదు, 2:1-13

విశ్వాసము క్రయలు కలిగి ఉంటుంది, 2:14-26

విశ్వాసము నాలుకను సాధుపరచును, 3:1-12

           విశ్వాస జ్ఞానము, 3:13-5:18

  1.    జ్ఞానము యొక్క  నిర్వచనము, 3:13-18
  2. పాపమునకు మూలమును గూర్చిన జ్ఞానము, 4:1-10

విశ్వాసము యొక్క అన్వయము, 4:11-20

తీర్పులలొ విశ్వాసము అన్వయించుట, 4:11-12

ఆర్ధికసంబంధ కార్యములు తలపెట్టునప్పుడు విశ్వాసము అన్వయించుట, 4:13-17

ఉద్యోగ సమస్యలలొ విశ్వాసము అన్వయించుట, 5:1-6

పాపముమీద విజయము కొరకు విశ్వాసము అన్వయించుట, 5:7-20

శీఘ్రమైన రాకడకు ఓపిక, 5:7-11

ప్రార్ధన, 5:12-20

 

Share